Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 ఏళ్లుగా పోలీస్‌ శాఖలో కీలక విధులు నిర్వహించిన ఏంజెల్‌కు ఘనంగా వీడ్కోలు

పేలుడు పదార్థాలను గుర్తించడంలో ఏంజెల్ స్పెషలిస్ట్‌. ఇది 30వ తేదీన జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సదస్సులో విధి నిర్వహణలో పాల్గొంది. ఏంజెల్ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, డజన్ల కొద్దీ ప్రముఖుల కార్యక్రమాలలో కూడా ఏంజెల్‌ పనిచేసింది. 

8 ఏళ్లుగా పోలీస్‌ శాఖలో కీలక విధులు నిర్వహించిన ఏంజెల్‌కు ఘనంగా వీడ్కోలు
Farewell For Police Dog
Follow us
Jyothi Gadda

|

Updated on: May 01, 2023 | 2:46 PM

పదవీ విరమణ పొందిన ఆడ కుక్క ఏంజెల్‌ను జిల్లా కేజీఎఫ్ పోలీసులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. 2015 మార్చి 13న విధుల్లో చేరిన ఏంజెల్ అనే ఆడ లాబ్రడార్ కుక్క ఎనిమిదేళ్లు కర్ణాటకకు చెందిన పోలీసు శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందింది. పేలుడు పదార్థాలను గుర్తించడంలో ఎంతో నైపుణ్యం కలిగినది ఈ ఏంజెల్‌.

Police Dog

పేలుడు పదార్థాలను గుర్తించడంలో ఏంజెల్ స్పెషలిస్ట్‌. ఇది 30వ తేదీన జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సదస్సులో విధి నిర్వహణలో పాల్గొంది. ఏంజెల్ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, డజన్ల కొద్దీ ప్రముఖుల కార్యక్రమాలలో కూడా ఏంజెల్‌ పనిచేసింది. 

Police Dog1

ఎనిమిదేళ్లుగా పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో పనిచేసి ఈరోజు పదవీ విరమణ పొందిన డాగ్ ఏంజెల్‌కు ఎస్పీ ధరణీదేవి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..