Assam: తాగుడికి అలవాటు పడ్డ 300 మంది పోలీసులు అస్సాం ప్రభుత్వం బంపర్ ఆఫర్

అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. మద్యానికి అలవాటుపడిన దాదాపు 300 మంది పోలీసులకు స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.

Assam: తాగుడికి అలవాటు పడ్డ 300 మంది పోలీసులు అస్సాం ప్రభుత్వం బంపర్ ఆఫర్
Assam Cm Himanta Biswa Sarma
Follow us
Aravind B

|

Updated on: May 01, 2023 | 3:17 PM

అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. మద్యానికి అలవాటుపడిన దాదాపు 300 మంది పోలీసులకు స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. తాగుడికి అలవాటు పడిన 300 మంది పోలీసులు, జవాన్ల శరీరాలు దెబ్బతిన్నాయని.. అందుకే ప్రభుత్వం వారిని స్వచ్చంద పదవీ విరమణ నిబంధన తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అయితే ఈ వీఆర్ఎస్ అనేది కొత్త నిబంధన కాదని.. ఇంతకు ముందే ప్రారంభించినప్పటికి దాన్ని అమలు చేయలేదని తెలిపారు.

మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ వీఆర్ఎస్ తీసుకున్న పోలీసులు కూడా మొత్తం వేతానాన్ని పొందుతారని సీఎం తెలిపారు. అలాగే వాళ్ల ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు కొత్త పోలీస్ నియామకాన్ని చేపడతామని పేర్కొన్నారు. అయితే గతంలో తాగుడికి అలావాటైన కొంతమంది పోలీసులు తమ విధుల్లో ఉండగానే సీనియర్లతో అనుచితంగా ప్రవర్తించినందుకు వారిని సస్పెండ్ చేసిన దాఖలు కూడా ఉన్నాయి. ఇటీవల సీనియర్ అధికారులు, ఎస్పీలతో జరిగిన వర్చువల్ మీటింగ్‌లో సీఎం హిమంత్ బిస్వా శర్మ పోలీసుల ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అవసరం లేని పోలీసులను తొలగించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌‌‌పై వాళ్లు దృష్టిపెట్టేలా చూడాలని ఆదేశించారు.  అలాగే తాగుడికి బాగా అలావాటు పడి లేదా అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వారికి వీఆర్ఎస్ లేదా సీఆర్ఎస్ కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..