Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరుగుతున్న రసంలో పడి విద్యార్థి మృతి.. పార్ట్ టైమర్‌గా చేస్తూ..

ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతవారం ఓ వివాహ వేడుకలో ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన 21 ఏళ్ల యువకుడు స్థానిక క్యాటరింగ్ సంస్థలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడని..

మరుగుతున్న రసంలో పడి విద్యార్థి మృతి.. పార్ట్ టైమర్‌గా చేస్తూ..
21 Years Old Died After Falling In Boiling Vessel
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 01, 2023 | 3:36 PM

ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి ఓ కాలేజ్ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతవారం ఓ వివాహ వేడుకలో ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన 21 ఏళ్ల యువకుడు స్థానిక క్యాటరింగ్ సంస్థలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడని, గతవారం వివాహ కార్యక్రమంలో పాల్గొని అతిధులకు వడ్డన చేస్తుండగా వేడివేడి రసంలో పడిపోయాడని అధికారులు చెబుతున్నారు.

అనంతరం అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారని, అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆ యువకుడు ఆదివారం మృతి చెందాడని వారు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వారు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..