AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ఉప్పొంగిన అభిమానం.. ధోనీ కోసం సైక్లింగ్ చేస్తూనే 2400 కిలోమీటర్లు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవనక్కర్లేదు. ఇక కొన్ని సందర్భాలలో ధోనిపై అభిమానులు చూపించే అభిమానం ఎంతటివారినైనా అబ్బురపరుస్తుంది.  ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని ధోని..

MS Dhoni: ఉప్పొంగిన అభిమానం.. ధోనీ కోసం సైక్లింగ్ చేస్తూనే 2400 కిలోమీటర్లు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
MS Dhoni
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 01, 2023 | 3:10 PM

Share

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవనక్కర్లేదు. ఇక కొన్ని సందర్భాలలో ధోనిపై అభిమానులు చూపించే అభిమానం ఎంతటివారినైనా అబ్బురపరుస్తుంది.  ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని ధోని కోసం ఏకంగా 2400 కీ.మీ దూరం సైక్లింగ్ చేసుకుంటూ.. ఢిల్లీ నుంచి చెన్నైకి పయనమయ్యాడు. ఢిల్లీ యూనివర్సిటీలో ఫాకల్టీగా చేస్తున్న గౌరవ తనేజాకు ధోనీ అంటే అమితమైన ప్రేమ ఇష్టం. ఓ వైపు బాడీ బిల్డర్‌గా, న్యూట్రీషన్‌గా, యూట్యూబర్‌గా రాణిస్తూనే ధోనిపై తన అభిమానాన్ని చూపిస్తుంటాడు తనేజా. ఇక తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ జరుగుతున్న నేపథ్యంలో ‘దేశ్ కా ధోని’ అనే క్యాంపెయిన్‌తో.. చెన్నైలో ధోనిని కలుసుకునేందుకు ఢిల్లీ నుంచి సైక్లింగ్ చేసుకుంటూ బయలుదేరాడు. అలా 2400 కి.మీ దూరం చేరుకున్న క్రమంలో తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశాడు.

అయితే ఇది తెలిసిన తర్వాత ధోని అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. ఓ యూనివర్సీటిలో ఫాకల్టీగా ఉన్న వ్యక్తి కూడా ధోనిపై ఇంతలా అభిమానం చూపించడం నిజంగా అద్భుతమని, ధోనిని కలిసేందుకు ఢిల్లీ నుంచి రావచ్చు కానీ సైక్లింగ్ చేసుకుంటూ వచ్చేంత అభిమానం అంటే చాలా గ్రేట్ అంటూ తనేజా అభిమానాన్ని మెచ్చుకుంటున్నారు. ధోని కోసం మరి ఇంతలా ఎలా చేయగలుగుతున్నారో నాకు అర్థం కావడంలేదు, ఎవరైనా నాకు కొంచెం చెప్పండంటూ మరో నెటిజన్ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా, చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే చివరి సీజన్ అనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలోనే గౌరవ్ తనేజా చివరిసారిగా అయినా ధోనిని చెపాక్ మైదానంలో చూసేందుకు ఆరాటపడుతున్నారని పలువురు  అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎన్ని ప్రయోజనాలో!
లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎన్ని ప్రయోజనాలో!
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..
రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..
అదిరిపోయే ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి టెక్నో కొత్త ఇయర్‌బడ్స్
అదిరిపోయే ఏఐ ఫీచర్లతో మార్కెట్లోకి టెక్నో కొత్త ఇయర్‌బడ్స్
వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ!వాడకం మామూలుగా లేదు
వార్నీ..గుడిలో పోయిన చెప్పుల కోసం చాట్‌జీపీటీ!వాడకం మామూలుగా లేదు
దోసెలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే? పిండి ఎలా కలపాలో తెలుసా?
దోసెలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే? పిండి ఎలా కలపాలో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీరేనట.. ఆదిరెడ్డి అంచనా
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీరేనట.. ఆదిరెడ్డి అంచనా
ప్రహరీ గోడ నిర్మాణం.. పిల్లర్లు అవసరమా?
ప్రహరీ గోడ నిర్మాణం.. పిల్లర్లు అవసరమా?