AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: 42 మ్యాచ్‌లు.. అత్యధిక 200 ప్లస్ స్కోర్స్.. ఈ ఐపీఎల్‌లో అరవీర భయంకరులు.. దిగితే ఊచకోతే!

ఐపీఎల్ 2023లో 42 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో 3 సెంచరీలు నమోదు కాగా.. 200 ప్లస్ స్కోర్స్ అయితే ఏకంగా 24 నమోదయ్యాయి. అంటే 42 మ్యాచ్‌లలోని 24 ఇన్నింగ్స్‌లు జట్లు స్కోర్లు 200 ప్లస్ దాటాయి.

IPL 2023: 42 మ్యాచ్‌లు.. అత్యధిక 200 ప్లస్ స్కోర్స్.. ఈ ఐపీఎల్‌లో అరవీర భయంకరులు.. దిగితే ఊచకోతే!
Ipl 2023
Ravi Kiran
|

Updated on: May 01, 2023 | 1:35 PM

Share

ఐపీఎల్ 2023లో 42 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో 3 సెంచరీలు నమోదు కాగా.. 200 ప్లస్ స్కోర్స్ అయితే ఏకంగా 24 నమోదయ్యాయి. అంటే 42 మ్యాచ్‌లలోని 24 ఇన్నింగ్స్‌లు జట్లు స్కోర్లు 200 ప్లస్ దాటాయి. ఇక ఇప్పటివరకు ఏ సీజన్‌లోనూ ఈ ఫీట్ జరగలేదు. ఇంతటి విధ్వంసానికి గత రికార్డులన్నీ కూడా ఒక్కసారిగా బద్దలయ్యాయని చెప్పొచ్చు. ఈ సీజన్‌లో దాదాపుగా ఏ బ్యాట్స్‌మెన్ కూడా తన వ్యక్తిగత మైలురాయిపై దృష్టి సారించలేదు.

ప్రత్యర్ధి జట్టును ఎదుర్కునే క్రమంలో తమ టీం స్కోర్ 200 దాటాలన్న ఉద్దేశంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అందుకే ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు కేవలం 3 సెంచరీలు మాత్రమే నమోదు కావడం విశేషం. అలాగే జట్టు స్కోర్స్ 200 దాటడానికి మరో కారణం.. స్టార్టింగ్, ఎండింగ్ కేకపుట్టించడమే. ఎందుకంటే చాలా టీమ్స్ ఫస్ట్ పవర్ ప్లే, అలాగే లాస్ట్ డెత్ ఓవర్లను బాగా సద్వినియోగం చేసుకున్నాయి.

మరోవైపు అత్యధిక స్కోర్లు సాధించిన బ్యాటర్ల అందరి స్ట్రైక్ రేట్ ఒకరిద్దరి మినహా మిగిలినవారిది దాదాపుగా 150 కంటే ఎక్కువే ఉంది. ఈ ఫీట్ సాధించిన వారు సైతం ఓపెనర్లు, వన్ డౌన్ బ్యాటర్లే కావడం విశేషం. అంతేకాకుండా ఈ సీజన్ భవిష్యత్తు మ్యాచ్‌ల్లో కూడా ఇంకా 200 ప్లస్ స్కోర్లు నమోదవుతాయని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. కాగా, ఈ సీజన్‌లో యశస్వి జైస్వాల్(124), వెంకటేష్ అయ్యర్(104), హ్యారీ బ్రూక్(100) సెంచరీలు నమోదు చేయగా.. అత్యధిక పరుగులు రాబట్టిన వీరుల లిస్టులో జైస్వాల్(428), డుప్లెసిస్(422), కాన్వె(414), గైక్వాడ్(354), విరాట్ కోహ్లీ(333) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు.

Follow Us
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!
డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..
ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..
పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ
పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ
చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు
చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..
NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!
NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!
23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!
23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!
బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్..
బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్..
కళ్లముందే రాయిలా మారే జీవి.. సముద్రపు మాయగాడు ఆక్టోపస్ రహస్యాలు..
కళ్లముందే రాయిలా మారే జీవి.. సముద్రపు మాయగాడు ఆక్టోపస్ రహస్యాలు..