- Telugu News Photo Gallery Cricket photos IPL Stats prove that every time KL Rahul scored less than 20, LSG put on a total of nearly 200
IPL 2023: కేఎల్ రాహుల్ తొందరగా ఔట్ అయితేనే, లక్నో టీమ్‌కి భారీ స్కోర్..! గణాంకాలు చెబుతున్న వివరాలివే..
ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్, ఐపీఎల్ అభిమానులలో ఒకటే చర్చ.. కేఎల్ రాహుల్ తొందరగా ఔట్ అయితే ఆ టీమ్ భారీ స్కోర్ చేయగలుగుతోంది. అలా కాకుండా రాహుల్ 20 కంటే ఎక్కువ పరుగులు చేస్తే టీమ్ తక్కువ స్కోర్‌కే పరిమితమవుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ స్టాట్స్‌నే అందుకు నిదర్శనం చూపిస్తున్నారు నెటిజన్లు.. ఆ వివరాలమేటిటో చూద్దాం..
Updated on: May 01, 2023 | 11:56 AM

ఐపీఎల్ 2023: ఐపీఎల్ సీజన్ 16లో భారీ స్కోరు నమోదు చేసి రికార్డు సృష్టించిన లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన లక్నో టీమ్ 5 గెలిచింది. ఈ 5 మ్యాచ్‌ల్లో కూడా కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు 3 సార్లు 200కు పైగా పరుగులు చేయడం విశేషం.

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ పవర్‌ప్లేలో ఔట్ అయిన ప్రతిసారి కూడా ఆ టీమ్ భారీ మొత్తంలో పరుగులు రాబడుతోంది. ఇంకా కేఎల్ రాహుల్ తొందరగానే ఔటైన మ్యాచ్‌ల్లో లక్నో సూపర్‌జెయింట్స్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో 257 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 9 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు.

అలాగే ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 20 బంతుల్లో 18 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.

అదేవిధంగా CSKపై రాహుల్ 18 బంతుల్లో 20 పరుగులు చేసినప్పటికీ, లక్నో సూపర్ జెయింట్స్ 205 పరుగులు చేసింది. ఈ విధంగానే ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్‌జెయింట్స్ 193 పరుగులు చేసిన సమయంలో, KL రాహుల్ 12 బంతుల్లో 8 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇంకా లక్నో టీమ్ తరఫున కేఎల్ రాహుల్ రాణించిన ప్రతి సారీ ఆ జట్టు తక్కువ స్కోర్‌కే పరిమితమవుతోంది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 159 పరుగులు మాత్రమే చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్‌పై రాహుల్ 32 బంతుల్లో 39 పరుగులు చేయగా, లక్నో 154 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అలాగే, గుజరాత్ టైటాన్స్‌పై కేఎల్ రాహుల్ 61 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 128 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ 127 పరుగులు చేయగా, కేఎల్‌ఆర్ 31 బంతుల్లో 35 పరుగులు చేసింది.

ఈ గణాంకాల ద్వారా కేఎల్ రాహుల్ 20 కంటే తక్కువ బంతులు ఎదుర్కొని తొందరగానే ఔటైతే.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు భారీ మొత్తాన్ని కూడగడుతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా పవర్‌ప్లేలో రాహుల్ స్లో పేస్‌లో బ్యాట్‌ను ఝుళిపించడం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతోంది.

అయితే రాహుల్ స్లో బ్యాటింగ్ కారణంగా కొన్ని మ్యాచ్‌లను కోల్పోయిందని అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కెఎల్ రాహుల్ ముందుగానే నిష్క్రమించడం, లక్నో సూపర్ జెయింట్స్ భారీ మొత్తం సాధించిన గణాంకాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.





























