- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Yashasvi Jaiswal creates many records with his Maiden Hundred against Mumbai Indians
Yashasvi Jaiswal: ఐపీఎల్ క్రికెట్‌లో యువ సంచలనం.. తొలి సెంచరీతోనే రికార్ఢులన్నీ గల్లంతు..
ఐపీఎల్ 2023: ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 1000వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మ్యాన్ యశస్వీ జైస్వాల్ మెరుపు సెంచరీతో హోమ్ టీమ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అంతేకాక ఐపీఎల్ కెరీర్‌లోనే తొలి సెంచరీ చేసిన ఈ యువ కెరటం ఎన్నో రికార్డులు సృష్టించాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: May 01, 2023 | 10:58 AM

ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీమ్ తరఫున యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ కేవలం 53 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అంతే కాకుండా 62 బంతుల్లో 8 భారీ సిక్సర్లు, 16 ఫోర్లతో 124 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతని స్ర్టైక్ రేట్ 200గా ఉండడం విశేషం. ఈ సెంచరీతోనే జైస్వాల్ రికార్డుల వర్షం కురిపించాడు.

రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఇప్పుడు యశవ్ జైస్వాల్ పేరిట ఉంది. అంతకుముందు జోస్ బట్లర్ 64 బంతుల్లో 124 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు జైస్వాల్ కేవలం 62 బంతుల్లోనే 124 పరుగులు చేశాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కూడా జైస్వాల్ రికార్డు సృష్టించాడు. 2011లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన పాల్ వాల్తాటి CSKపై 120 పరుగులు చేయడం ఇప్పటి వరకు రికార్డు. ఇప్పుడు జైస్వాల్ 124 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఇంకా ముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా కూడా జైస్వాల్ రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల యశస్వీ జైస్వాల్ 53 బంతుల్లోనే సెంచరీ పూర్తి ఈ ఘనత సాధించాడు.

అలాగే రాజస్థాన్ రాయల్స్ తరఫున సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా జైస్వాల్ నిలిచాడు. ముంబై ఇండియన్స్‌పై భారీ సెంచరీతో చెలరేగిన జైస్వాల్ ప్రస్తుత వయసు 21 ఏళ్ల 123 రోజులు.

ఇవే కాకుండా ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా యాష్యా జైస్వాల్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అంతక ముందు 104 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పుడు జైస్వాల్ 124 పరుగులు చేసి మొదటి స్థానానికి చేరుకున్నాడు.




