Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ‘పగవాడికి కూడా రాకూడని చావు’.. దోమల కోసం ఎదురులేని మాస్టర్ ప్లాన్.. వావ్ అనిపించే వీడియో..

దోమల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఆల్ ఔట్, జెట్ కాయిన్స్, ఒడోమస్ వంటివి వాడుతుంటారు. అయితే అవేమి అవసరం లేకుండా దోమలను చంపేందుకు ఓ మంచి చిట్కా ఉంది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్..

Funny Video: ‘పగవాడికి కూడా రాకూడని చావు’.. దోమల కోసం ఎదురులేని మాస్టర్ ప్లాన్.. వావ్ అనిపించే వీడియో..
Funny Tips to Kills Mosquitoes
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 01, 2023 | 2:06 PM

చూడడానికి చిన్నగానే ఉండే దోమలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. వీటి కారణంగానే డయేరియా, మలేరియా వంటివి కూడా వ్యాపిస్తాయి. ఈ క్రమంలో వీటి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఆల్ ఔట్, జెట్ కాయిన్స్, ఒడోమస్ వంటివి వాడుతుంటారు. అయితే అవేమి అవసరం లేకుండా దోమలను చంపేందుకు ఓ మంచి చిట్కా ఉంది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దోమలను చంపడానికి వీడియోలోని వరుణ్ రాజ్ అనే వ్యక్తి చెప్పిన మాస్టర్ ప్లాన్ నెటిజన్లకు తెగ నచ్చేయడంతో పాటు నవ్వులు తెప్పిస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో వరుణ్ రాజ్ దోమలను చంపడానికి ఓ మాస్టర్ ప్లాన్ వివరిస్తుంటాడు. అందుకోసం రక్తం రంగులోకి మారేంతగా కారం కలిపిన నీరు, కొన్ని నీళ్లు, ఫెవికాల్ పూసిన చిన్న క్లాత్ ఉంటే చాలని కూడా చెప్తాడు. రక్తంలా ఉన్న కారపు నీటిలోకి దిగగానే దోమకు మండుతుందని, కడుగుకోవడానికి పక్కనే ఉన్న నీటిలోకి దిగుతుందని చెప్పుకొస్తాడు. ఆ తర్వాత శరీరంపై తడిని తుడుచుకోవడానికి పక్కనే ఉన్న క్లాత్‌ని వాడుకుంటుందని, అయితే అందుకు ముందుగానే ఆ క్లాత్‌కి ఫెవికాల్ పూయాలని సూచిస్తాడు. అలా చేయడం వల్ల దోమ ఆ క్లాత్‌కి అంటుకుని ఉంటుందని, ఆ తర్వాత దాన్ని చంపేయోచ్చని అంటాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను వరుణ్ రాజ్ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతా నుంచి పోస్ట్ చేస్తాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Varun Raj (@varun_raj_vlogs)

ఇక ఈ వీడియో కాస్త ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఈ క్రమంలోనే వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘అయ్యో ఈ ప్లాన్ దోమలకు తెలిసిపోతే అటు వైపు రావుగా బ్రో’ అంటూ సరదాగా రాసుకొచ్చాడు ఓ నెటిజన్. ఇదేలా మరో నెటిజన్ ‘ఇలాంటి చావు పగవాడికి కూడా రాకూడదు. బ్రో మీలో మాంచి టాలెంట్ ఉంది’ అంటూ కామెంట్ చేశాడు. ఇంకా ‘ఇ ఒక్క వీడియో చాలు. నేను ని అభిమానిని అని గర్వాంగా చెప్పుకోవడానికి..’ అంటూ వరుణ్ రాజ్‌ ఫ్యాన్ ఒకరు చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 7 లక్షల 93 వేల వీక్షణలు, 45 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఇంకా ఈ వీడియోను పలువురు నెటిజన్లు తమ సన్నిహితులకు సరదాగా షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..