Rain Alert: ముంచుకొస్తున్న వరుణుడు.. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. వచ్చే 24 గంటలు చాలా కీలకం

అకాల వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విదర్భ నుంచి దక్షిణ..

Rain Alert: ముంచుకొస్తున్న వరుణుడు.. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. వచ్చే 24 గంటలు చాలా కీలకం
Rain Alert
Follow us
Narender Vaitla

|

Updated on: May 01, 2023 | 2:33 PM

అకాల వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విదర్భ నుంచి దక్షిణ కర్నాటక వరకు విస్తరించిన ద్రోణి కారణంగా వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే దక్షిణ కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలెవరూ చెట్ల కింద ఎవరు ఉండకూడదని అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, మరో మూడు రోజులు వర్షాలు ఉంటాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి.. పది రోజులుగా వానలు కురుస్తుండగా.. మరో రెండు రోజుల పాటూ రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఏపీ వాతావరణశాఖ. రైతులు, గొర్రెల కాపరులు, రైతులు చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది.. మరోవైపు ఈ వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట నీటి పాలు కావడంతో లబోదిబోమంటున్నారు.

తెలంగాణలోనూ..

ఇదిలా ఉంటే ఇటు తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. విదర్భ నుంచి తమిళనాడు, తెలంగాణ మీదుగా ద్రోణి కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాతావారణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే వానలు పడుతుండగా.. రానున్న మూడు రోజుల పాటు కూడా కొనసాగే అవకాశముందని అంచనా వేసింది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..మరో మూడు రోజులు వర్షాలు తప్పవని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వెదర్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!