Artificial Intelligence: ఆ ఉద్యోగాలపై వేలాడుతున్న అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కత్తి.. వారు అలెర్ట్ కావాల్సిందే
అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందనే ఆందోళన నెలకొంది. అయితే ఈ అంశంపై డిజిట్ రీసెర్చ్ ల్యాబ్ అనే సంస్థ దాదాపు 3,500 మంది టెక్ రంగ యువ వృత్తినిపుణులు, విద్యార్థులతో ఓ సర్వే నిర్వహించింది.

అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందనే ఆందోళన నెలకొంది. అయితే ఈ అంశంపై డిజిట్ రీసెర్చ్ ల్యాబ్ అనే సంస్థ దాదాపు 3,500 మంది టెక్ రంగ యువ వృత్తినిపుణులు, విద్యార్థులతో ఓ సర్వే నిర్వహించింది. కృత్రిమ మేధా వల్ల ఉద్యోగం పోతుందనే ఆందోళన వర్కింగ్ ప్రొఫెషనల్స్‌తో పోలిస్తే టెక్ విద్యార్థుల్లో అధికంగా ఉందని ఈ సర్వే తెలిపింది. ఏఐకి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోకపోతే తమ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుందేమోనని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారని పేర్కొంది.
59 శాతం మంది ఏఐను అటు అవకాశంగానూ..ఇటూ ప్రమాదకరంగాను భావిస్తున్నారని తెలిపింది. 11 శాతం మంది కచ్చితంగా ఏఐ వల్ల ప్రమాదమే ఏర్పడుతుందని. వృత్తిలో పోటీ పెరిగి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంది. ఏఐ ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటుందనే భావన 40 శాతం విద్యార్థుల్లో , 36 శాతం వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో ఉన్నట్లు తెలిపింది. ఏఐ, మెషీన్ లెర్నింగ్, తదితర కొత్త తరం సాంకేతికత నేర్చుకోకపోతే వృత్తి జీవితంలో ఎదుగుదలపై ప్రభావం పడుతుందని 75 శాతం మంది భావిస్తున్నట్లు వివరించింది.
అయితే భారత విద్యా వ్యవస్థలో క్రిటికల్ థింకింగ్, ప్రోబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని 54 శాతం మంది, డిజిటల్ అక్షరాస్యతలో బలమైన పునాదులు నిర్మించాలని 49 శాతం మంది కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఏఐ సంబంధిత సబ్జెక్టులను పాఠ్యాంశాలుగా జత చేయాలని 46 శాతం మంది అలాగే భవిష్యత్‌కు సరిగ్గా సిద్ధం అయ్యేందుకు ఏఐ వంటి వాటిని అందిపుచ్చుకునేలా ఒకటి కంటే ఎక్కువ విభాగాలు నేర్చుకునేలా ప్రోత్సాహం ఇవ్వాలని 30 శాతం మంది భావిస్తున్నట్లు వెల్లడించింది.




మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..