Acer Swift Laptop: స్విఫ్ట్ గో పేరుతో మార్కెట్‌లోకి కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్స్ అదిరిపోయాయిగా..!
పెరుగుతున్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కొత్త మోడల్స్‌లో ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్స్ రిలీజ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకున్న ఏసర్ ప్రస్తుతం స్విఫ్ట్ పేరుతో మరో కొత్త ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
భారతదేశంలో ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ సమయంలో మొదలైన విధానం ఇంకా కొనసాగుతూ ఉంది. అలాగే కరోనా లాక్‌డౌన్ సమయంలో పిల్లలకు కూడా ఆన్‌లైన్ క్లాసులు పెరిగాయి. దీంతో ప్రతి ఇంట్లో స్మార్ట్‌ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్ అవసరం పెరిగింది. దీంతో పెరుగుతున్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కొత్త మోడల్స్‌లో ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్స్ రిలీజ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకున్న ఏసర్ ప్రస్తుతం స్విఫ్ట్ పేరుతో మరో కొత్త ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏసర్ భారతదేశంలో ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో ఏసర్ స్విఫ్ట్ గో ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. కేవలం 1.25 కేజీల లైట్ వెయిట్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ కంపెనీ ఇప్పటికే రిలీజ్ చేస్తే స్విఫ్ట్ ల్యాప్‌టాప్‌కు జోడింపుగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 14 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ ధర రూ.80,000 కంటే తక్కువే ఉండే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే ఈ ల్యాప్‌టాప్ ధరను కంపెనీ రూ.79,990గా నిర్ణయించింది. అలాగే అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఏసర్ స్విఫ్ట్ గో స్పెసిఫికేషన్లు ఇవే
- ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాల 2880×1800 రిజుల్యూషన్‌తో ఓఎల్ఈడీ డిస్‌ప్లే
- 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 16:10 యాస్పెక్ట్ రేషియో
- స్టీరియో స్పీకర్ సపోర్ట్
- ఐ5 ప్రాసెసర్‌తో 16 జీబీ+512 జీబీ వేరియంట్‌లో లభ్యం.
- 64 బిట్ విండోస్ 11 హోం రన్నింగ్
- స్టూడెంట్స్ కోసం ఎంఎస్ ఆఫీస్ హోం, స్టూడెంట్ సపోర్ట్
- 100 వాట్స్ చార్జింగ్ సపోర్ట్‌తో 4 సెల్ 65 డబ్ల్యూహెచ్ బ్యాటరీ
- హెచ్‌డీఎంఐ పోర్ట్, రెండు యూఎస్‌బీ 3.2 పోర్టులు, హెడ్ ఫోన్ జాక్, మైక్రో ఎస్‌డీ స్లాట్, టైప్ సీ పోర్టులతో వస్తుంది.
- తాత్కాలిక నాయిస్ క్యాన్సిలేషన్‌తో యూఎస్‌బీ క్యూ హెచ్‌డీ వెబ్ క్యామ్ సపోర్ట్
- వ్యక్తిగత భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్
- చీకట్లో కూడా టైప్ చేసేందుకు బ్యాక్ లీట్ కీ బోర్డు ప్రత్యేకత.
- కేవలం రూ.117తో రెండు సంవత్సరాలు ఎక్స్‌టెండెడ్ వారెంటీ సపోర్ట్
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..