Smartwatch: అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అదరగొడుతోన్న కొత్త స్మార్ట్ వాచ్.. తక్కువ ధరలోనే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్.
ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సంస్థ ఫైర్ బోల్ట్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఫైర్ బోల్ట్ ఫొనిక్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌ను స్టన్నింగ్ లుక్‌తో రూపొందించారు. స్టీల్ స్ట్రాప్‍తో సరికొత్తగా తీర్చిదిద్దారు. ఇప్పటికే సేల్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. తక్కువ బడ్జెట్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో తీసుకొచ్చిన తీసుకొచ్చిన...

ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సంస్థ ఫైర్ బోల్ట్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఫైర్ బోల్ట్ ఫొనిక్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌ను స్టన్నింగ్ లుక్‌తో రూపొందించారు. స్టీల్ స్ట్రాప్‍తో సరికొత్తగా తీర్చిదిద్దారు. ఇప్పటికే సేల్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. తక్కువ బడ్జెట్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో తీసుకొచ్చిన తీసుకొచ్చిన ఈ వాచ్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి.? ధర ఎంత.? లాంటి వివరాలు మీకోసం.. ఈ స్మార్ట్ వాచ్‌లో 1.39 ఇంచెస్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను ఇచ్చారు. 100కు పైగా ఇన్‌బుల్ట్ వాచ్ ఫేసెస్ ఈ స్మార్ట్ వాచ్‌లో పొందుపరిచారు. ఇక ఈ వాచ్‌ను స్టెయిన్‍లెస్ స్టీల్ స్ట్రాప్స్, స్టీల్ బాడీతో తయారు చేశారు. మొత్తంగా స్లీక్, స్టీల్ డిజైన్‍తో వచ్చింది. 240×240 పిక్సెల్స్ రెజల్యూషన్ స్క్రీన్ సొంతం. 120పైగా స్పోర్ట్స్ మోడ్స్, వాయిస్ అసిస్టెంట్‌కి ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.
ఇక ఈ స్మార్ట్ వాచ్‌లో హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, ఎస్‍పీఓ2 మానిటరింగ్ లాంటి హెల్త్ ఫీచర్లను ఇచ్చారు. బ్యారటీ విషయానికొస్తే ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ వాచ్ 7 రోజుల వరకు పని చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్స్ కోసం IP7 రేటింగ్‍ను ఇచ్చారు. కాల్యుకులేటర్, అలారమ్, ఫైండ్ మై ఫోన్ లాంటి ఫీచర్లు అదనం. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను ఇచ్చారు. ఇందుకోసం వాచ్‍లో బుల్ట్ఇన్‍గా స్పీకర్, మైక్ ఇచ్చారు. మొబైల్‍కు కనెక్ట్ చేసుకొని ఈ వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. వాచ్‍లోనే కాల్ హిస్టరీ యాక్సెస్ చేసుకోవచ్చు. క్విక్ డయల్ ప్యాడ్, సింక్ కాంటాక్ట్ సదుపాయాలు ఉంటాయి. నోటిఫికేషన్లను కూడా వాచ్‍లో చూసుకోవచ్చు.
ధర విషయానికొస్తే.. ఫైర్ బోల్ట్ ఫీనిక్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ ధర రూ.1,999గా ఉంది. ప్రత్యేక ఆఫర్‌గా ఈ ధరకు అందిస్తోంది. అయితే తర్వాత ధరను పెంచనుందా అన్న దానిపై క్లారిటీ లేదు. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌తో పాటు ఫైర్ బోల్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. బ్లూ, గోల్డ్, డార్క్ గ్రే, సిల్వర్, రెయిన్‍బో కలర్స్‌లో ఈ వాచ్ లభిస్తోంది.




మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..