నడక నేర్చుకుంటున్న పిల్ల జిరాఫీ.. మొదటి అడుగు కోసం పడుతున్న కష్టాలు.. వైరలవుతున్న వీడియో..
ఈ వీడియోకు 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ 27 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు. 'మొదటి అడుగు వేయడం చాలా కష్టం.' మరొక వినియోగదారు 'జిరాఫీలు అత్యంత ఆకర్షణీయమైన జీవులు' అని వ్యాఖ్యానించారు. జిరాఫీ పిల్ల ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.
నడక నేర్చుకునే చిన్న పిల్లలను మనం చూశాం.. కిందపడి మళ్ళీ లేచి నడవాలని ప్రయత్నించి మళ్లీ కిందపడిపోతుంటారు.. అలాంటిదే ఒక జీరాఫీ పిల్ల నడకన నేర్చుకునే క్రమంలో తొలి అడుగులు వేస్తున్న వీడియోను @buitengebiden (Buitengebiden) అనే ట్విట్టర్ పేజీలో షేర్ చేయగా, ఆ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏదైన ఒక పని మళ్లీ మళ్లీ ప్రయత్నించినప్పుడే విజయం సాధించగలం. ఇందుకు నిదర్శనమే ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్ని జిరాఫీ నడక నేర్చుకునే క్రమం. కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిస్తూ చాలాసార్లు కిందపడిపోతుంది. ఎలాగోలా లేచి ముందుకు నడవడానికి ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. జంతువులకు సంబంధించిన ఏ వీడియో అయినా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో జంతువుల అమాయకమైన వీడియోలు మనకు నెటిజన్లకు మరింత ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. తరచూ అలాంటి వీడియో చూస్తూ నెటిజన్లు అలసట తీరుతుంటారు. ఇది కూడా వీడియోనే. ఒక చిన్న జిరాఫీ నడక నేర్చుకునేందుకు ప్రయత్నంలో అందరి హృదయాల్ని కదిలించే వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు.
జిరాఫీ పిల్ల నడవడానికి ప్రయత్నించి ఒక్కసారిగా కిందపడిపోవడం వీడియోలో కనిపిస్తుంది. కానీ, అది తన ప్రయత్నాన్ని విరమించుకోకుండా మళ్లీ లేచి నడవటానికి ప్రయత్నిస్తుంది. రెండు సార్లు పడిపోయినా చివరికి లేచి నిలబడింది. అప్పుడు అది తన తల్లి జిరాఫీ వద్దకు చేరుకుని ఆ పక్కగా నిలబడుతుంది.
First steps of a baby giraffe.. ? pic.twitter.com/NQcH3iS9L4
— Buitengebieden (@buitengebieden) April 27, 2023
‘బేబీ జిరాఫీ తొలి అడుగులు వేస్తుంది’ అనే టైటిల్‌తో ఈ వీడియోను రూపొందించారు. ఈ వీడియోపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. మీరు ‘నాలుగు సార్లు పడిపోయినా, ఐదోసారి లేస్తారు.. అంటూ నెటిజన్లు వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ 27 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు. ‘మొదటి అడుగు వేయడం చాలా కష్టం.’ మరొక వినియోగదారు ‘జిరాఫీలు అత్యంత ఆకర్షణీయమైన జీవులు’ అని వ్యాఖ్యానించారు. జిరాఫీ పిల్ల ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి :