ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్.. పోలీసుల అదుపులో 32 మంది టెలీకాలర్లు..
కేటుగాళ్ల ముఠా మరో మోసాన్ని గుట్టురట్టు చేశారు. అయితే.. మోసపోయిన నిరుద్యోగుల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కూడా ఉన్నారు. ఇక.. నిందితుల నుంచి భారీగా మొబైల్స్ ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్, సిమ్ కార్డులతోపాటు నాలుగు బైకులు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు సైబర్ క్రైం పోలీసులు.
అమాయక నిరుద్యోగులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పని పట్టారు హైదరాబాద్ పోలీసులు. పలు రాష్ట్రాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. పంజాబ్‌లో నకిలీ కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి అమాయక యువతను నమ్మించి మోసం చేస్తున్ననిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సిద్దిపేటకు చెందిన ప్రధాన నిందితుడు గడగొని చక్రధర్‌గౌడ్, గణేష్, శ్రావణ్‌తోపాటు 32మంది టెలీ కాలర్స్‌ను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహామెహ్రా వెల్లడించారు.
హైదరాబాద్‌లోనే కాదు.. ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో నిరుద్యోగులను నకిలీ కాల్ సెంటర్ ముఠా మోసం చేసినట్లు గుర్తించారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి 50 లక్షలపైగా వసూలు చేశారన్నారు సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహామెహ్రా.
మొత్తంగా.. హైదరాబాద్ పోలీసులు.. కేటుగాళ్ల ముఠా మరో మోసాన్ని గుట్టురట్టు చేశారు. అయితే.. మోసపోయిన నిరుద్యోగుల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కూడా ఉన్నారు. ఇక.. నిందితుల నుంచి భారీగా మొబైల్స్ ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్, సిమ్ కార్డులతోపాటు నాలుగు బైకులు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు సైబర్ క్రైం పోలీసులు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..