Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ప్రత్యేకమైన బియ్యం.. షుగర్‌ పేషంట్లకు వరం..! పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు..

బియ్యం పాలిష్ చేయటం వల్ల అందులోని విటమిన్ బి బయటకు వెళ్లిపోతుంది. దాని గ్లైసెమిక్ సూచిక కూడా పెరుగుతుంది. దీని కారణంగా గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఇటీవలి కాలంలో ఆరోగ్యానికి మరింత హాని కలిగించే కల్తీ బియ్యం కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయి. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ బియ్యం తినాలి?

ఈ ప్రత్యేకమైన బియ్యం.. షుగర్‌ పేషంట్లకు వరం..! పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు..
Best Rice Varieties
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 29, 2023 | 9:21 PM

ప్రపంచవ్యాప్తంగా తినే ఆహార ధాన్యాలలో బియ్యం ఒకటి. కానీ, మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులను వైట్ రైస్ తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇందులో స్టార్చ్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. వైట్ రైస్ కూడా అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంది. ఇది డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. టైప్ 2 డయాబెటిస్ రోగులు తక్కువ అన్నం తినడానికి ముఖ్య కారణం కూడా ఇదే. అయితే మధుమేహ బాధితులకు మరో మార్గం లేదని కాదు..సహజంగా పండించిన బియ్యం ఆరోగ్యానికి అంత ప్రమాదకరం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ, వరి నుండి బియ్యాన్ని తీయడానికి దానిని రైస్ మిల్లులకు పంపించి, ఆపై తెల్లగా, మెరుస్తూ ఉండేలా పాలిష్ చేస్తారు. అయితే, ఈ ప్రక్రియ సహజంగా పండించిన బియ్యం పోషక విలువలను తగ్గిస్తుంది. బియ్యం పాలిష్ చేయటం వల్ల అందులోని విటమిన్ బి బయటకు వెళ్లిపోతుంది. దాని గ్లైసెమిక్ సూచిక కూడా పెరుగుతుంది. దీని కారణంగా గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఇటీవలి కాలంలో ఆరోగ్యానికి మరింత హాని కలిగించే కల్తీ బియ్యం కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయి. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ బియ్యం తినాలి?

టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులు వైట్ రైస్ లేదా వైట్ రైస్‌తో చేసిన అన్నం తినకూడదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు . కానీ వారికి బ్రౌన్ రైస్ రూపంలో మంచి ఎంపిక ఉంది. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ పోషకాలు, ఎక్కువ ఫైబర్, ఎక్కువ విటమిన్లు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ ఉంటాయి.

ఏ బియ్యం అత్యల్ప GI స్కోర్‌ని కలిగి ఉంది? వైట్ రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ 70 ఉంది. అంటే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ప్రమాదకర డీల్, బాస్మతి రైస్ GI స్కోర్ 56 నుండి 69 వరకు ఉంటుంది. అంటే ఇది వైట్ రైస్ అంత ఎక్కువగా ఉండదు.. మరోవైపు, బ్రౌన్ రైస్ విషయానికి వస్తే, దాని GI స్కోర్ 50కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి చాలా మంది ఆరోగ్య నిపుణులు దీనిని తినమని సిఫార్సు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..