Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Rule: హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియో చూస్తే రూ.5000 జరిమానా..3 నెలలు జైలు శిక్ష! అమల్లోకి కొత్త నిబంధన..

అంతే కాదు, ఎవరైనా ప్రయాణికులు గట్టిగా మాట్లాడటం కూడా నిషేధించబడింది. ఈ నియమాన్ని అనుసరించి ఎవరైనా పాటలు వినాలనుకుంటే లేదా వీడియోలను చూడాలనుకుంటే హెడ్‌ఫోన్‌లలో చూడటం లేదా వినడం మంచిది. దీనికి సంబంధించి ఏప్రిల్ 25 న నోటిఫికేషన్ కూడా జారీ చేశారు..

New Rule: హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియో చూస్తే రూ.5000 జరిమానా..3 నెలలు జైలు శిక్ష! అమల్లోకి కొత్త నిబంధన..
New Rule Kicks In Best Buse
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 29, 2023 | 8:39 PM

సాధారణంగా బస్సు, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు స్మార్ట్ ఫోన్లలో వీడియోలు చూడటం ప్రారంభిస్తారు. కొందరు హెడ్‌ఫోన్స్‌ ఉపయోగించకుండా ఎక్కువ సౌండ్‌ పెట్టుకుని వీడియోలను చూస్తుంటారు. అలాంటి వారికి గువ్వ గుయ్యిమనిపించేలా కొత్త నిబందన అమల్లోకి వచ్చింది. నలుగురితో నాకేంటి అనుకుని పెద్ద పెద్ద శబ్ధాలతో వీడియోలు చేస్తే మాత్రం మీ జేబులకు చిల్లు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అలా చేస్తే మీకు భారీ జరిమానా పడుతుంది. ప్రయాణాల్లో పెద్ద పెద్ద సౌండ్లతో వీడియోలు చూడటం, పాటలు వినడం వంటివి చేస్తూ తోటి ప్రయాణికులు, వృద్ధులను ఇబ్బందులకు గురిచేయడం మనం కూడా చూస్తుంటాం..అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి ఇప్పుడు కొత్త రూల్‌ను సిద్ధం చేశారు. దీని ప్రకారం ఎవరైనా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు బిగ్గరగా వీడియోలు లేదా పాటలు వినడం ప్రారంభిస్తే, ఆ వ్యక్తి ₹ 5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు..3 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.

ఈ నిబంధన వచ్చే వారంలోనే ముంబైలో అమల్లోకి రానుంది. ఈ నిబందన నియమం బెస్ట్ అంటే బృహన్ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా అమలు చేయనున్నారు.. ఈ నిబంధన ప్రకారం బస్సులో మొబైల్ ఫోన్ స్పీకర్‌లో వీడియోలు చూడడం లేదా పెద్ద శబ్దంతో పాటలు ప్లే చేయడం పూర్తిగా నిషేధించబడింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 25 న నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.. ఈ నిబంధన గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అలా చేయవద్దని సూచించారు. ఎందుకంటే అలా చేస్తే శిక్షార్హమైన నేరం అవుతుంది.

ముంబైలో శబ్ద కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. దీని కారణంగా చాలా మంది ప్రజలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధ ప్రయాణికులు శబ్ధకాలుష్యం కారణంగా మరింత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నా ఆ వ్యక్తి పాట వింటున్నప్పుడు లేదా వీడియో చూస్తున్నప్పుడు చాలా సమస్యలను ఎదుర్కొంటారని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త రూల్ తీసుకొచ్చారు. అంతే కాదు, ఎవరైనా ప్రయాణికులు గట్టిగా మాట్లాడటం కూడా నిషేధించబడింది. ఈ నియమాన్ని అనుసరించి ఎవరైనా పాటలు వినాలనుకుంటే లేదా వీడియోలను చూడాలనుకుంటే హెడ్‌ఫోన్‌లలో చూడటం లేదా వినడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..