AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేకప్‌ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్లిన పెళ్లికూతురు.. మండపంలో విసిగి వేసారిన వరుడు.. కట్‌ చేస్తే

ప్రేమలో పడిన వారు సగంలోనే వదిలేయడం, నిశ్చితార్థం చేసుకుని క్యాన్సిల్ చేసుకోవడం, పెళ్లి పందిట్లోనే ఈ అమ్మాయి లేదంటే ఈ అబ్బాయి నాకు వద్దు అని చెప్పడం సర్వసాధారణమైపోయింది. అందుకే పెళ్లికి ముందు ఇంత ప్రిపరేషన్, పనులు చేసినా తాళి కట్టేంత వరకు కూడా పెళ్లి జరుగుతుందనే నమ్మకం లేకుండా పోయింది.

మేకప్‌ కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్లిన పెళ్లికూతురు.. మండపంలో విసిగి వేసారిన వరుడు.. కట్‌ చేస్తే
Wedding
Jyothi Gadda
|

Updated on: Apr 29, 2023 | 6:48 PM

Share

పెళ్లి అనేది నూరేళ్ల బంధం, ఇద్దరు మనుషులను కలిపే అందమైన సంబంధం. అందుకే పెళ్లి విషయంలో ముందు వెనక అన్ని చూసుకుంటూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో ఈ పవిత్ర సంబంధం దాని అర్ధాన్ని కోల్పోయింది. విడాకులు, అనైతిక సంబంధం కారణంగా వివాహం అర్థరహితం అవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రేమలో పడిన వారు సగంలోనే వదిలేయడం, నిశ్చితార్థం చేసుకుని క్యాన్సిల్ చేసుకోవడం, పెళ్లి పందిట్లోనే ఈ అమ్మాయి లేదంటే ఈ అబ్బాయి నాకు వద్దు అని చెప్పడం సర్వసాధారణమైపోయింది. అందుకే పెళ్లికి ముందు ఇంత ప్రిపరేషన్, పనులు చేసినా తాళి కట్టేంత వరకు కూడా పెళ్లి జరుగుతుందనే నమ్మకం లేకుండా పోయింది. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది.

ఇండోర్‌కు చెందిన 19ఏళ్ల యువతి పెళ్లికి రెడీ అవుతానంటూ ఓ వధువు బ్యూటీపార్లర్‌కు వెళ్లి ప్రియుడితో కలిసి పారిపోయింది. వధువు కోసం కల్యాణ మండపంలో గంటల తరబడి నిరీక్షించిన వరుడు, సహా బంధుమిత్రులు సహనం కోల్పోయి ఆందోళనకు దిగటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు ఎంత సేపటికి తిరిగి ఇంటికి రావడం లేదు. దీంతో వధువు తల్లిదండ్రులు పార్లర్‌కు ఎవరితో వెళ్లారని ఆమె స్నేహితులను అడిగి తెలుసుకున్నారు.

బ్యూటీ పార్లర్ నుంచి 19 ఏళ్ల యువతి తన ప్రేమికుడితో కలిసి పారిపోయినట్లు తెలిసింది. బ్యూటీ పార్లర్ నుండి పారిపోయిన అమ్మాయి తను ప్రేమించిన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వార్త విన్న వధువు తల్లి స్పృహతప్పి పడిపోయింది. తన కూతురు పారిపోవడంపై వధువు తండ్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..