Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కస్టమర్లకు రిలయన్స్ జియో బంఫర్ ఆఫర్.. ఏడాది పొడవునా నెట్‌ఫ్లిక్స్‌లో ఉచిత సినిమాలు.. ఇదిగో ప్లాన్‌..

ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 200GB హై స్పీడ్ డేటా, 500GB రోల్‌ఓవర్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, SMS సౌకర్యం, మూడు SIM కార్డ్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లతో లభిస్తుంది.

కస్టమర్లకు రిలయన్స్ జియో బంఫర్ ఆఫర్.. ఏడాది పొడవునా నెట్‌ఫ్లిక్స్‌లో ఉచిత సినిమాలు.. ఇదిగో ప్లాన్‌..
Watch Newflix Free
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 29, 2023 | 4:13 PM

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లలో అందుబాటులోకి తెస్తుంది. రిలయన్స్ జియో ఇటీవల ఎంపిక చేసిన పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌లను వెల్లడించింది. ఉచిత OTT సభ్యత్వం వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా 5G నెట్‌వర్క్‌లో నెట్‌ఫ్లిక్స్ అపరిమిత OTT కంటెంట్‌ను చూసే అవకాశం కల్పిస్తుంది. దీంతో మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో మరింత అధిక నాణ్యత గల సినిమాలను చూస్తూ ఎంజాయ్‌ చేయొచ్చు. ఈ OTT సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌లు Jio పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో అందుబాటులో ఉన్నాయి. అవి Jio రూ. 399, Jio రూ. 599, Jio రూ. 799, Jio రూ. 999 మరియు Jio రూ. 1499. ఈ పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు అపరిమిత వాయిస్ కాల్‌లు, 100 SMS/రోజును అందిస్తాయి.

ఇది అతి చవకైన ప్లాన్‌..

Jio ప్లాన్ ధర రూ. 399, ఇది మీకు నెలకు 75GB డేటా, ఏదైనా నెట్‌వర్క్‌లో అన్‌ లిమిటెడ్‌ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్‌లకు ఒక సంవత్సరం ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.

ఇవి కూడా చదవండి

పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధర రూ. 799

రూ. 799 ప్లాన్ 150GB డేటా, 200GB రోల్‌ఓవర్ డేటాను అందిస్తుంది. ఇది రెండు అదనపు సిమ్ కార్డ్‌లు, ఏదైనా నెట్‌వర్క్‌లో అపరిమిత కాలింగ్, అపరిమిత SMS అందించే ఫ్యామిలీ ప్లాన్. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్‌లకు సభ్యత్వాలను కూడా అందిస్తుంది.

ఈ ప్లాన్ అత్యంత ఖరీదైనది.

రూ. 1,000 లోపు OTT ప్లాన్‌ల జాబితాలో ఇది అత్యంత ఖరీదైన ప్లాన్. రూ. 999కి అందుబాటులో ఉన్న ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 200GB హై స్పీడ్ డేటా, 500GB రోల్‌ఓవర్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, SMS సౌకర్యం, మూడు SIM కార్డ్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లతో లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..