AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Byju Raveendran: అసలు ఎవరీ రవీంద్రన్‌.. బైజూస్‌ వేల కోట్ల కంపెనీగా ఎలా ఎదిగింది?

ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌లో ఈడీ సోదాలు జరగడంతో చర్చనీయాశంగా మారింది. ఫెమా చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు బెంగళూరులో సోదాలు చేపడుతున్నారు. సంస్థ అందుకున్న 28 వేల కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి...

Byju Raveendran: అసలు ఎవరీ రవీంద్రన్‌.. బైజూస్‌ వేల కోట్ల కంపెనీగా ఎలా ఎదిగింది?
Byju Raveendran Life Story
Narender Vaitla
|

Updated on: Apr 29, 2023 | 3:48 PM

Share

ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌లో ఈడీ సోదాలు జరగడంతో చర్చనీయాశంగా మారింది. ఫెమా చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు బెంగళూరులో సోదాలు చేపడుతున్నారు. సంస్థ అందుకున్న 28 వేల కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ED విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో 9754 కోట్లను కంపెనీ విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్టు ED గుర్తించింది. మరో వైపు ప్రకటనలు, మార్కెటింగ్‌ ఖర్చుల కోసం కంపెనీ 944 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్‌ను బైజూస్‌ ఆడిట్‌ చేయించలేదని సమాచారం. ఈ విషయాలపై ED విచారణ కొనసాగుతోంది.

దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి బైజూస్‌పై పడింది. కరోనా సమయంలో భారీగా లాభాలు ఆర్జించిన ఈ కంపెనీ భారత యూనికార్న్‌ స్టార్టప్‌ కంపెనీల్లో అగ్ర స్థానంలో నిలిచింది. చిన్న సంస్థగా మొదలైన బైజూస్‌ వ్యాపార సామ్రాజ్యం వేల కోట్లకు ఎదిగింది. ఈ నేపథ్యంలో అసలు ఈ బైజూస్‌ సీఈఓ రవీంద్రన్‌ ఎవరు.? బైజూస్‌ ఈ స్థాయికి ఎలా ఎదిగింది లాంటి అంశాలను తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి బైజూస్‌ సీఈఓ రవీంద్రన్‌ లైఫ్ స్టోరీపై ఓ లుక్కేద్దామా..

అసలు ఎవరీ రవీంద్రన్‌..

కేరళలోని అజికోడ్‌ గ్రామంలో జన్మించిన రవీంద్రన్‌ కన్నూర్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేశారు. అనంతరం CAT పరీక్షలో వరుసగా రెండుసార్లు 100 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన రవీంద్రన్‌ కొన్ని రోజుల్లోనే ఉద్యోగాన్ని వదిలేసి.. CAT పరీక్షకు సిద్ధమయ్యే వారికి శిక్షణ ఇవ్వడానికి 2007లో ఒక కంపెనీని ప్రారంభించారు. ఇలా మొదలైన రవీంద్రన్‌ వ్యాపార ప్రస్థానం 2011లో కీలక మలుపు తిరిగింది. 2011లో రవీంద్రన్‌ తన భార్య గోకుల్‌ నాథ్‌తో కలిసి థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ అనే కంపెనీనీ స్థాపించారు. ఆ తర్వాత దీనినే బైజూస్‌గా మార్చారు. భార్య దివ్య గోకుల్‌నాథ్‌, సోదరుడు రిజు రవీంద్రనాథ్‌ కలిసి రవీంద్రన్‌ బైజూస్‌లో గణనీయమైన వాటాను కలిగి ఉన్నారని ఫోర్బ్స్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

రవీంద్రన్‌ ఆధ్వర్యంలో బైజూస్‌ 2020లో అందరికీ విద్య అనే సామాజిక చొరవను ప్రారంభించింది. 2025 నాటికి 50 లక్షల మంది పిల్లలను విద్యావంతులను చేయాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. అంతేకాకుండా విద్యార్థులకు కోడింగ్ నైపుణ్యాలను అందించే లక్ష్యంగా ఏర్పాటైన ముంబైకి చెందిన వైట్‌హాట్‌ జూనియర్‌ని బైజూస్ కొనుగోలు చేసింది. అలాగే 2021లో సింగపూర్‌ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఆన్‌లైన్‌ లెర్నింగ్ ఫ్లాట్‌ఫామ్‌ టాపర్‌నిసైతం కొనుగోలు చేసింది. అలాగే ఇటీవల మరో ప్రముఖ ఎక్యుకేషన్‌ సంస్థ ఆకాష్‌ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను సైతం బైజూస్‌ సొంతం చేసుకుంది.

ఇంతింతై అన్నట్లు బైజూస్‌ ప్రస్థానం శరవేగంగా విస్తరించింది. ప్రపంచంలోనే 13వ అత్యంత విలువైన యూనికార్న్‌ కంపెనీగా బైజూస్‌ నిలిచింది. 2021 గణంకాల ప్రకారం 21 బిలియన్‌ డాలర్లకు చేరుకున్న తొలి ఇండియన్‌ స్టార్టప్‌గా బైజూస్‌ నిలిచింది. ప్రస్తుతం బైజూస్‌కు ప్రపంచవ్యాప్తంగా 6.5 మిలియన్ల మంది వార్షిక చందదారులు ఉన్నారు. 100 మిలియన్లకు పైగా విద్యార్థులు ఇందులో రిజిస్టర్‌ చేసుకున్నారు. విద్యార్థులు ఈ యాప్‌పై రోజుకు సగటను 71 నిమిషాలు సమయం కేటాయిస్తున్నారు.

మరిన్ని Byju Raveendran: అసలు ఎవరీ రవీంద్రన్‌.. బైజూస్‌ వేల కోట్ల కంపెనీగా ఎలా ఎదిగింది? క్లిక్ చేయండి..