Bank Holidays in May 2023: కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..

బ్యాంకు వినియోగదారులకు అలర్ట్‌. వచ్చే నెల అంటే మే నెలలో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. వినియోగదారులు ముందస్తుగా గమనించి బ్యాంక్‌ పనులను ప్లాన్‌ వేసుకోవడం మంచిది. రిజర్వ్‌ బ్యాంక్‌..

Bank Holidays in May 2023: కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..
మీరు తరచూ ఆర్ధిక లావాదేవీల నిమిత్తం బ్యాంక్‌కు వెళ్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవులు. మీకు ఒకవేళ బ్యాంక్ పనులు ఉన్నట్లయితే.. ముందుగా ఈ సెలవుల లిస్టు ఏంటో ఓసారి చూసి.. ముందస్తుగా ప్లాన్‌ను సిద్దం చేసుకోండి. అప్పుడే మీ ఆర్ధిక లావాదేవీలకు ఎలాంటి ఆటంకం కలగదు.
Follow us
Subhash Goud

|

Updated on: Apr 29, 2023 | 3:35 PM

బ్యాంకు వినియోగదారులకు అలర్ట్‌. వచ్చే నెల అంటే మే నెలలో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. వినియోగదారులు ముందస్తుగా గమనించి బ్యాంక్‌ పనులను ప్లాన్‌ వేసుకోవడం మంచిది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రతినెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. బ్యాంకుల పని నిమిత్తం చాలా మంది వెళ్తుంటారు. అయితే ముందస్తుగా బ్యాంకు సెలవులను గుర్తించుకుని ప్లాన్‌ చేసుకుంటే సమయం వృధా కాకుండా ఉండడమే కాకుండా కొంత ఆర్థిక నష్టం కూడా వాటిల్లకుండా చూసుకోవచ్చు. ప్రతి నెల, పండుగలు, వారాంతాల్లో కూడా దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే విడుదల చేసిన జాబితాలో బ్యాంకుల సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గమనించాలి. మరి మే నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉండనున్నాయో తెలుసుకుందాం.

  1. మే 1 – మేడే
  2. మే 5 – బుద్ద పూర్ణిమ
  3. మే 7- ఆదివారం
  4. మే 9- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి
  5. మే 13 – రెండో శనివారం
  6. మే 14- ఆదివారం
  7. మే 16 – రాష్ట్ర దినోత్సవం (సిక్కింలో మాత్రమే)
  8. మే 21- ఆదివారం
  9. మే 22- మహారాణా ప్రతాప్‌ జయంతి
  10. మే 24- కాజీ నజ్రుల్‌ ఇస్లాం జయంతి (త్రిపురాలో)
  11. మే 27- నాలుగో శనివారం
  12. మే 28- ఆదివారం

నోట్‌: ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఉండవు. ఆయా రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయని