Komaki Ranger E-Bike: కిర్రాక్ లుక్‌లో క్రూయిజర్ ఈ-బైక్.. సింగిల్ చార్జ్‌పై ఏకంగా 250 కిలోమీటర్లు.. వివరాలివి..
కోమకి కంపెనీ ఓ సూపర్ ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లోకి అందుబాటులో ఉంచింది. క్రూయిజర్ మోడల్‌లో కోమకి రేంజర్ పేరిట ఇచ్చిన ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తోంది. అంతేకాక అప్ గ్రేడెడ్ ఫీచర్లను కంపెనీ అందించింది. దీనిలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే..

మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ బాగా కనిపిస్తోంది. పెట్రోల్ ఇంజిన్ లతో కనిపించే ప్రతి మోడల్ బైక్ ఎలక్ట్రిక్ వేరియంట్ లాంచ్ చేసేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రసిద్ధి చెందిన స్కూటర్లు, బైక్‌లు ఎలక్ట్రిక్ వేరియంట్లో దర్శనిమిస్తున్నాయి. అదే కోవలో కోమకి కంపెనీ ఓ సూపర్ ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లోకి అందుబాటులో ఉంచింది. క్రూయిజర్ మోడల్‌లో కోమకి రేంజర్ పేరిట ఇచ్చిన ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తోంది. అంతేకాక అప్ గ్రేడెడ్ ఫీచర్లను కంపెనీ అందించింది. దీనిలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే దీని రేంజ్. ఈ బైక్ లోని బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 200 నుంచి 250 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించుకుంది. అమేజింగ్ బ్యాలెన్స్, స్మూత్ రైడ్, ఎక్స్‌ట్రాడినరీ ఫీచర్లు ఈ బైక్ లో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫీచర్లు, సామర్థ్యం ఇలా.. ఈ-బైక్‌లో 4.5kwh లిథియం ఐయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది స్మార్ట్ బ్యాటరీ యాప్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో పార్క్ అసిస్ట్, మోబైల్ చార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ సెన్సార్, డ్యూయల్ సౌండ్ పైపులు ఉంటాయి. ఈ పైపులు సాధారణ ఇంధన బైక్ సైలెన్సర్‌లను పోలి ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆన్ బోర్డ్ నావిగేషన్ కోసం ఏడు అంగుళాల టీఎఫ్‌టీ స్కీన్ ఉంటుంది. ఇన్‌క్లూజివ్ స్టోరేజ్ స్పేస్ 50 లీటర్ల సామర్థ్యంతో ఉంటుంది.
వేగం ఇలా.. ఈ క్రూయిజర్ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీనిలోని బ్యాటరీ కేవలం నాలుగు గంటల్లోనే 0 నుంచి 90 శాతం చార్జింగ్ ఎక్కుతుంది.



దేశంలోనే తొలి ఈ-క్రూయిజర్ బైక్ ఇదే.. అదనపు ఫీచర్ల గురిచి కోమకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోమకి రేంజర్ ఈ బైక్ అత్యాధునిక అదనపు ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయ్యిందని అన్నారు. ఇది వినియోగదారులకు సులువైన, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుందన్నారు. ఇది భారతదేశంలోనే తొలి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ ఇదే అని ఆయన వివరించారు.
బ్రేకింగ్ సిస్టమ్.. సీబీఎస్ డబుల్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. బైక్‌కు ముందు భాగంలో, వెనుక భాగంలో డిస్క్ బ్రేకులు ఉంటాయని చెప్పుకోవచ్చు. సుపీరియర్ సస్పెన్షన్ దీని సొంతం.
ధర ఎంతంటే.. కోమకి రేంజర్ ఈ క్రూయిజర్ బైక్ ధర రూ. 1.85 లక్షలుగా ఉంది. మీ ప్రాంతం ప్రాతిపదికన బైక్ ధరలో కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు. రేటు ఎక్కువగా ఉన్నా కూడా ఫీచర్లు బాగున్నాయి. లాంగ్ రేంజ్ దీని సొంతం. అందువల్ల ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ బైక్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..