వావ్ అనిపించే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్! అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై 40శాతానికి పైగా డిస్కౌంట్..
Amazon Great Summer Sale 2023:ఇంట్లో కూర్చొనే నచ్చిన వస్తువులను, ఆకర్షణీయమైన ధరలకు కొనుగోలు చేసేందుకు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ గొప్ప అవకాశాన్ని మీకిస్తోంది. గ్రేట్ సమ్మర్ సేల్ పేరిట దేశంలో ప్రారంభిస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ ను అమెజాన్ విడుదల చేసింది.

వేసవి ఉద్ధృతం అవుతోంది. వేడిగాలులు వీస్తున్నాయి. భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఈ మండు వేసవిలో బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన విషయం. ఇక షాపింగ్లు గట్రా అయితే నో చాన్స్. అందుకే ఇంట్లో కూర్చొనే నచ్చిన వస్తువులను, ఆకర్షణీయమైన ధరలకు కొనుగోలు చేసేందుకు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ గొప్ప అవకాశాన్ని మీకిస్తోంది. గ్రేట్ సమ్మర్ సేల్ పేరిట దేశంలో ప్రారంభిస్తోంది. దీనికి సంబంధించిన ఆఫీషియల్ టీజర్ ను అమెజాన్ విడుదల చేసింది. ఈ సేల్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయాన్ని అమెజాన్ ప్రకటించలేదు గానీ, సేల్ ఉండే ఆఫర్ల గురించి టీజర్ లో రివీల్ చేసింది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై అదిరిపోయే ఆఫర్లు ఉంటాయిన పేర్కొంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ సేల్ ఒక రోజు ముందే పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫోన్లు, ఫోన్ యాక్సెసరీస్ పై 40శాతం..
అమెజాన్ విడుదల చేసిన టీజర్ లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు యాక్సెసరీస్ పై 40శాతం డిస్కౌంట్ అమెజాన్ణ గ్రేట్ సమ్మర్ సేల్ ఉంటుందని వివరించింది. అలాగే కొన్ని ఫోన్లపై భారీ ఆఫర్లు ఉండునున్నట్లు ప్రకటించింది. పోస్టర్లో వన్ ప్లస్, శ్యామ్సంగ్, జియోమీ, రియల్మీ వంటి ఫోన్లు కనిపిస్తున్నాయి. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా రూ. 1555 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
ల్యాప్ టాప్, స్మార్ట్ వాచ్ లపై 75శాతం డిస్కౌంట్..
అమెజాన్ త్వరలో రానున్న గ్రేట్ సమ్మర్ సేల్ లో ల్యాప్ టాప్లు, స్మార్ట్ వాచ్లు, హెడ్ ఫోన్ల వంటి వాటిపై 75శాతం వరకూ డిస్కౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా ల్యాప్ టాప్ లపై రూ. 40,000 వరకూ ఆఫర్లు ఉన్నాయి. అలాగే ట్యాబ్లెట్లపై 60శాతం, హెడ్ ఫోన్లపై 75శాతం డిస్కౌంట్లు ఉన్నాయి.
టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై..
ఒక వేళ మీరు టీవీలు కొనుగోలు చేయాలను చూస్తుంటే వచ్చే కొన్ని రోజుల్లోనే అద్భుత ఆఫర్లు అమెజాన్ లో ఉండనున్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో టీవీలపై దాదాపు 60శాతం వరకూ తగ్గింపు లభించే అవకాశం ఉంది. రిఫ్రిజిరేటర్లపై 60శాతం, వాషింగ్ మేషిన్లపై 50శాతం డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ ప్రకటించింది. ఒకవేళ పాత టీవీని ఎక్స్చేంజ్ చేసేటట్లు అయితే రూ. 5,000 వరకూ ఎక్స్చేంజ్ పొందే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







