OLA: క్వాలిటీ విషయంలో తగ్గేదేలే.. ఎలక్ట్రిక్ స్కూటర్‌తో కళ్లు చెదిరే స్టంట్స్.. వీడియో చూస్తే వావ్ అంటారు..
ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరుగుతోంది. కరెంట్ నడిచే వాహనాల తయారీకి ప్రభుత్వాలు రాయితీలు ఇస్తుండడం, రోజురోజుకీ పెరుగుతోన్న ఇంధన ధరలు కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు ఆదారణ పెరగడానికి కారణాలు చెప్పొచ్చు. దీంతో మార్కెట్లో పేరున్న...
ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరుగుతోంది. కరెంట్ నడిచే వాహనాల తయారీకి ప్రభుత్వాలు రాయితీలు ఇస్తుండడం, రోజురోజుకీ పెరుగుతోన్న ఇంధన ధరలు కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు ఆదారణ పెరగడానికి కారణాలు చెప్పొచ్చు. దీంతో మార్కెట్లో పేరున్న ఆటో మొబైల్ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనల తయారీ రంగంలోకి వస్తున్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కొందరికి ఇప్పటికే పలు అనుమానాలు ఉన్నాయి.
మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై వినియోగదారుల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ను తక్కువ బరువు ఉండాలనే ఉద్దేశంతో లైట్ మెటీరియల్‌ను ఉపయోగిస్తారు. దీంతో స్కూటర్‌ను చాలా సెన్సిటివ్‌గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందనే భావనలో ఉంటారు. అయితే ఓలా కంపెనీకి చెందిన స్కూటర్ల పనితీరు చూస్తే మాత్రం ఈ ఆలోచనను మానుకోవాల్సిందే. ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల పనితీరకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Wow didn’t imagine any scooter will be able do this?
And please don’t try it at home ?
The Ola S1 #BuiltToPerfection pic.twitter.com/LG7gSFxy53
— Bhavish Aggarwal (@bhash) April 28, 2023
బెంగళూరులోని టెస్టింగ్ ట్రాక్‌లో నిర్వహించిన స్టంట్‌లో రైడర్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాల్గొన్నాడు. దుమ్ముదూళి, గుంతలతో ఉన్న ట్రాక్‌పై ఓలా స్కూటర్ దూసుకుపోయింది. బైక్‌కు ఏ మాత్రం తగ్గకుండా సునాయాసంగా ట్రక్‌పై చక్కర్లు కొట్టింది. ఎలక్ట్రిక్ స్కూటర్ క్వాలిటీ ఈ రేంజ్‌లో ఉంటుందాని అని ఈ వీడియో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వీడియోను ఓలా కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఒక స్కూటర్‌తో ఇలా స్టంట్స్ చేయడం అసలు ఊహకు కూడా అందనిది అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..