AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constipation: ఇలా చేస్తే చాలు, మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టినట్లే.. ఇంకా ఫ్రీ మోషన్స్ పక్కా..!

Constipation: ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు అనేవి సర్వసాధారణ విషయంగా మారిపోయాయి. కాలనుగుణంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇక మానవాళిని వెంటాడి వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో మల బద్ధకం కూడా..

Constipation: ఇలా చేస్తే చాలు, మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టినట్లే.. ఇంకా ఫ్రీ మోషన్స్ పక్కా..!
Tips to get rid of Constipation
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 29, 2023 | 3:28 PM

Share

Constipation: ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు అనేవి సర్వసాధారణ విషయంగా మారిపోయాయి. కాలనుగుణంగా జీవనశైలి, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇక మానవాళిని వెంటాడి వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో మలబద్ధకం కూడా ఒకటి. శరీరంలోని వ్యర్థాలు సకాలంలో బయటకు వెళ్లకపోతే అదే మరి కొన్ని అరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందువల్ల మలబద్ధకం సమస్య ఉన్నవారు తీసుకునే ఆహారంలో దానిని అరికట్టే పదార్థాలను అదనంగా కలుపుకోవాలి. ఇంకా మలబద్ధకం ఉండకూడదంటే ఫ్రీ మోషన్‌కి దోహదపడేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ క్రమంలోనే ఎక్కువగా నీరు తీసుకోవలి. నీళ్లు తాగితే శరీరానికి కావలసినంతగా లభించడంతో పాటు ఫ్రీ మోషన్ తప్పక అవుతుంది. ఇంకా ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవ్వాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

అలాగే వ్యాయమం ద్వారా కూడా మలబద్ధకం సమస్యను అరికడుతుంది. ఇదే కాక వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జాకింగ్ వంటివి కూడా ఫ్రీ మోషన్ కోసం ఉపకరిస్తాయి. తద్వారా మలబద్ధకం నుంచి సులభంగా బయటపడొచ్చు. ఇంకా మీ ఆహారంలో వెల్లుల్లి, అరటి పండ్లు, ఉల్లిపాయలు వంటి ప్రీ బయోటిక్ ఫైబర్స్ ఉండేలా చూసుకోండి. ఇవి మీ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరచడమే కాక అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇంకా ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అవ్వాలంటే డైరీ ఫుడ్‌కి దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..