- Telugu News Photo Gallery Apple Store India: Do you know, how much Apple store employees in India earn as Monthly salary? check to know full details
Apple India: అందరికీ ఇదే ప్రశ్న..! ‘యాపిల్ స్టోర్‌లో పనిచేసే సిబ్బంది జీతం ఎంత?’.. తెలుసుకుందాం రండి..
Apple India: ఇటీవలే యాపిల్ కంపెనీ తన మార్కెట్‌ను భారతదేశంలో మరింత పెంచుకోవాలని రెండు యాపిల్ ఇండియా స్టోర్లను ప్రారంభించింది. అందులో దాదాపు 200 మంది సిబ్బందిని కూడా నియమించింది. అయితే నెటిజన్లలో చాలా మందికి యాపిల్ స్టోర్లలో పనిచేసే సిబ్బంది జీతం ఎంత ఉంటుందనే సందేహం వచ్చింది. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 29, 2023 | 2:43 PM

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల భారతదేశంలో రెండు ఆపిల్ స్టోర్లను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ‘యాపిల్ ఇండియా’ తన స్టోర్లలో విధులు నిర్వహించేందుకు కొంత మంది సిబ్బందిని నియమించుకున్నట్లు సమాచారం.

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ డ్రైవ్‌లో ఏర్పాటు చేసిన Apple BKC స్టోర్ ఇప్పటికే యాపిల్ కస్టమర్లను, సందర్శకలను అమితంగా ఆకర్షిస్తోంది.

అయితే ఇప్పుడు యాపిల్ స్టోర్ సిబ్బంది నెలవారీ జీతం ఎంత అనే విషయం గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ వివరాల కోసం గూగుల్ తల్లిని తెగ అడిగేస్తున్నారు నెటిజన్లు. అసలు యాపిల్ స్టోర్లలో పనిచేసే సిబ్బంది జీతం వింటే ఎవరైనా షాక్ అవుతారు.

మీడియా నివేదికల ప్రకారం, భారతదేశంలో యాపిల్ ఇండియా ప్రారంభించిన మొదటి రెండు కంపెనీలను నిర్వహించడానికి దాదాపు 170 మంది సిబ్బందిని నియమించుకుంది.

అంతేకాకుండా సిబ్బందికి నెలవారీ జీతం లక్ష రూపాయలుగా చెల్లిస్తుంది. అంటే ఇతర టెక్ బ్రాండ్‌లు తమ రిటైల్ స్టోర్ ఉద్యోగులకు ఇచ్చే జీతం కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ.

అదనంగా యాపిల్ ఇండియా తన కస్టమర్లు స్టోర్‌లోని సిబ్బందితో కమ్యూనికేషన్ సులభతరం చేయడానికి సుమారు 20 భాషలలో కమ్యూనికేట్ చేయగల సిబ్బందిని నియమించింది.





























