- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Ravindra Jadeja completes 300 T20 Matches and becomes 8hth Indian to achieve the feat
Ravindra Jadeja: టీ20 క్రికెట్‌లో జడ్డూ ‘త్రిపుల్ సెంచరీ’.. ఆ లిస్టులో 8వ ఆటగాడిగా రికార్డుల్లో.. పూర్తి వివరాలివే..
తాను ఆడుతున్న మ్యాచ్ ఫలితం ఏదైనా చెన్నై ఆల్ రౌండర్ జడేజా మాత్రం తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇంకా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో టీ20 క్రికెట్‌లో అరుదైన ట్రిపుల్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన 8వ భారత క్రికెటర్‌గా నిలిచాడు.
Updated on: Apr 29, 2023 | 3:07 PM

2022 ఐపీఎల్ సీజన్‌లో నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ 2023లో అద్భుతంగా పునరాగమనం చేసింది. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 5 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

నిజానికి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కి ముందు చెన్నై మొదటి స్థానంలో ఉంది. కానీ ఆ మ్యాచ్‌లో చెన్నై 32 పరుగుల తేడాతో ఓడిపోవడంతో నాలుగో స్థానానికి పడిపోయింది. మరోవైపు మ్యాచ్ ఫలితం ఏదైనా చెన్నై ఆల్ రౌండర్ జడేజా మాత్రం తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇంకా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో టీ20 క్రికెట్‌లో అరుదైన ట్రిపుల్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన 8వ భారత క్రికెటర్‌గా నిలిచాడు.

అవును రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్ తర్వాత భారత్ తరఫున 300 టీ20 మ్యాచ్‌లు ఆడిన 8వ ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. భారత్ తరఫున అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో దినేష్ కార్తీక్ ఉన్నాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో 300వ టీ20 మ్యాచ్ ఆడిన జడేజా, 2007లో తన టీ20 క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు. అలా తాను ఆడిన ఈ 300 టీ20 మ్యాచ్‌లలో జడ్డూ 3226 పరుగులు, 204 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఫార్మాట్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 16 పరుగులకు 5 వికెట్లు.

కాగా, జడేజా తన 300 టీ20 మ్యాచ్‌లలో 164 మ్యాచ్‌లను చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఆడాడు. అలా ఆ టీమ్ తరఫున 150 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా నిలిచాడు. చెన్నై తరఫున కెప్టెన్ ధోనీ 235 మ్యాచ్‌లు ఆడగా, సురేశ్ రైనా 200 మ్యాచ్‌లు ఆడాడు. అలాగే జడేజా భారత్ తరఫున 64 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.




