- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Dinesh Karthik interacted with U 16 players, netizens Started Trolling, check here for the reasons
IPL 2023: అండర్-16 ఆటగాళ్లకు దినేష్ కార్తీక్ సలహాలు.. ఒక్కసారిగా వెల్లువెత్తిన ట్రోల్స్.. ఎందుకంటే..?
ఐపీఎల్ సీజన్‌లో దినేష్ కార్తీక్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. 8 మ్యాచ్‌లు ఆడిన డీకే 83 పరుగులు మాత్రమే చేశాడు. అంటే ఆ జట్టుకి ఫినిషర్‌గా ఉన్న కార్తీక్ తన బ్యాటింగ్‌లో 11.86 పరుగులు మాత్రమే..
Updated on: Apr 29, 2023 | 7:50 PM

IPL 2023: బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జరిగిన అండర్-16 ఆటగాళ్ల ప్రత్యేక శిబిరంలో రాయల్ చాలెంజర్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మ్యాన్ దినేష్ కార్తీక్ కనిపించాడు. ఈ అండర్-16 శిబిరంలో పాల్గొన్న దినేష్ కార్తీక్ యువ క్రికెటర్లతో ముచ్చటించాడు. అతను వారికి తమ కలలను వెంబడించడానికి అవసరమైన విలువైన సలహాలను, ఇంకా తన జీవితంలోని పాఠాలను కూడా వివరించాడు.

ఈ స్పెషల్ ఇంటరాక్షన్‌కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలు వైరల్ అవుతున్న క్రమంలో డీకే ట్రోల్ కూడా కావడం విశేషం.

ఎందుకంటే ఈ ఐపీఎల్‌లో దినేష్ కార్తీక్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. 8 మ్యాచ్‌లు ఆడిన డీకే 83 పరుగులు మాత్రమే చేశాడు. అంటే ఆ జట్టుకి ఫినిషర్‌గా ఉన్న కార్తీక్ తన బ్యాటింగ్‌లో 11.86 పరుగులు మాత్రమే చేశాడు.

దినేష్ కార్తీక్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు మిడిలార్డర్‌లో విఫలమవడమే ఆర్సీబీ జట్టు ఓటమికి ప్రధాన కారణమని నెటిజన్ల అభిప్రాయం. ఇంత పేలవ ఫామ్‌లో ఉన్న డీకే యువ క్రికెటర్లకు ఏ విధమైన సలహాలు ఇచ్చేందుకు వెళ్లాడని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు.

‘యువ ఆటగాళ్లకు ఇచ్చిన సలహాలను మీ కెరీర్‌లో ఉపయోగించుకోండి’ అని కొందరు అంటుంటే, మరికొందరు ‘పేలవమైన ఫామ్‌లో ఉన్నా అవకాశం ఎలా పొందాలో సలహా ఇచ్చి ఉంటాడు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇంకా ఓ నెటిజన్ అయితే‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 391 మ్యాచ్‌లు ఆడి ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన ఆటగాడు మరో యువ క్రికెటర్లకు ఏ విధమైన పాఠాలు నేర్పుతాడు’ అని రాసుకొచ్చారు.

అండర్-16 ఆటగాళ్లతో ఇంటరాక్ట్ అయిన దినేష్ కార్తీక్ ఇప్పుడు ట్రోల్స్‌కు ఫోజులిచ్చాడు. అయితే, లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తన పాత స్వభావాన్ని ప్రదర్శించి ట్రోల్స్‌కు బ్యాట్‌తో సమాధానం ఇస్తాడో లేదో వేచి చూడాలి.
