- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: RCB's Josh Hazelwood Set To Play Against LSG Match
IPL 2023: కోహ్లీ టీమ్‌కు కొత్త ‘జోష్’ .. తర్వాతి మ్యాచ్‌లో ఆడనున్న స్టార్ ప్లేయర్
భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్ సమయంలో, మోకాలి గాయం కారణంగా హేజిల్‌వుడ్ మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. అలాగే ఈ కారణంగా ఐపీఎల్ ప్రథమార్థంలో ఆడలేదు. ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు.
Updated on: Apr 29, 2023 | 9:40 PM

IPL 2023 సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పుడు 9వ మ్యాచ్‌కి సిద్ధమైంది. మే 1న లక్నోలో జరగనున్న ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్‌తో RCB తలపడనుంది.

ఈ కీలక మ్యాచ్‌లో ఆర్‌సీబీ తరఫున స్పీడ్‌స్టర్ జోష్ హేజిల్‌వుడ్ ఆడటం దాదాపు ఖాయం. గాయం కారణంగా మొదటి 8 మ్యాచ్‌లకు దూరమయ్యాడు ఆసీస్ స్టార్ బౌలర్.

భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్ సమయంలో, మోకాలి గాయం కారణంగా హేజిల్‌వుడ్ మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. అలాగే ఈ కారణంగా ఐపీఎల్ ప్రథమార్థంలో ఆడలేదు. ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు.

కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు జోష్ అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అనుమతి లభించకపోవడంతో చివరి మ్యాచ్‌లో పాల్గొనలేదు. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్‌పై ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది.

ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు ప్రచురించిన కొత్త నివేదికలో, జోష్ హేజిల్‌వుడ్ లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. దీంతో పాటు తదుపరి మ్యాచ్‌లో జోష్ హేజిల్‌వుడ్ ఆడటం ఖాయం. జోష్ హేజిల్‌వుడ్ రాకతో ఆర్‌సీబీ బౌలింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారనుంది. ఎందుకంటే గత సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన పేసర్ జోష్ హేజిల్‌వుడ్. 12 మ్యాచుల్లో మొత్తం 20 వికెట్లు తీశాడు.





























