Amazing Talent: మట్టిలో మాణిక్యాలు.. వీళ్లకు సరిగ్గా సానపడితే ఒలంపిక్ పతకాలు పక్కా..
టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాక నిష్ప్రయోజకంగా మిగిలిపోయిన ‘మట్టిలో మాణిక్యాలు’ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారికి కాస్త చేయూతనందిస్తే వారు శిఖరాగ్రాలకు చేరుకోవడం, ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలకు..
టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాక నిష్ప్రయోజకంగా మిగిలిపోయిన ‘మట్టిలో మాణిక్యాలు’ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారికి కాస్త చేయూతనందిస్తే వారు శిఖరాగ్రాలకు చేరుకోవడం, ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలకు పతకాల వర్షం ఖాయం. ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి మట్టిలో మాణిక్యానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో ఓ చిన్నోడు చూపిన అథ్లెటిజం, జిమ్నాస్టిక్ జంప్స్ చూస్తే ఎవరైనా సరే అతని టాలెంట్‌ని మెచ్చుకోకుండా ఉండలేరు.
‘Talent is universal, but opportunity is not…’ అనే అద్భుతమైన క్యాప్షన్‌తో షేర్ అయిన వీడియోలో ఓ చిన్నపిల్లోడు జిమ్నాస్టిక్స్ చేస్తుంటాడు. ముందుగా కొంత దూరం నుంచి పరిగెత్తుతూ వచ్చి ఒక్క సారిగా గాల్లోకి ఎగురుతాడు. అంతే అబ్బురపరిచేలా గాలిలోనే మెలికలు తిరుగుతూ ల్యాడింగ్ అవుతాడు. అతని జంపింగ్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. గాల్లో మెలికలు తిరిగి ల్యాండ్ అయి కూడా కింద పడకుండా నిలబడే ఉంటాడు. సహజంగా ప్రొఫెషన్లల్ అథ్లెట్లు సైతం కొన్ని సార్లు కిందపడుతుంటారు. కానీ ఏ విధమైన అనుభవం లేని ఈ చిన్నోడు ఇలా జిమ్నాస్టిక్స్ చేయడం అందరికీ నమ్మశక్యం కానీ దృశ్యంగా మారింది.
Talent is universal, but opportunity is not… pic.twitter.com/irS9jVpa6F
— The Best (@Figensport) April 29, 2023
కాగా, ఈ వీడియోలోని చిన్నోడు ఎవరు, ఏ దేశం అనే విషయాలు తెలియరాలేదు కానీ అతను ఆఫ్రికన్ దేశాలకు చెందినవాడని అర్ధమవుతోంది. అలాగే అతను నివసించేది ఓ మురికి వాడలో అని, కనీసం కట్టుకోవడానికి చొక్కా కూడాలేని దీనస్థితిలో జీవిస్తున్నాడని తెలుస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ బాలుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వాలు చేయూతనిస్తే తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు, దేశానికి కూడా పేరు తీసుకురాగలని కొందరు నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరిలోనూ పదునైన స్కిల్స్ ఉన్నాయి కానీ వారికి అందరితో పాటు అవకాశాలు లభించవని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇలాంటివాళ్లకు సరిగ్గా సానపడితే ఒలంపిక్ పతకాలు పక్కా.. అన్నారు మరో నెటిజన్.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..