ఆ ఎంపీ డ్రైవర్ చేసిన నిర్వాకం..! నెట్టింట వైరలవుతున్న వీడియో.. నెటిజన్ల ఫైర్..
తనను కారు బ్యానెట్ పైకి నెట్టుకొని దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణించాడని బాధితుడు వాపోయాడు. తాను కారు ఆపమని ఎంత బతిమాలుకునప్పటికీ అతడు..మాట వినలేదని, కారు ఆపలేదని బాధితుడు పోలీసులకు వివరించాడు. అతను ఉద్దేశపూర్వకంగా తన కారు బానెట్‌పైకి ఎక్కి నానా బీభత్సం చేశాడని ఎంపీ డ్రైవర్ చెబుతున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక కారు డ్రైవరు ఓ వ్యక్తిని కారు బానెట్‌కు వేలాడదీసుకుని ఢిల్లీ రోడ్లపై మూడు కిలోమీటర్ల మేర కారు నడుపుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేపుతోంది. ఏప్రిల్ 30 ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ నుండి నిజాముద్దీన్ దర్గా వైపు వస్తున్న కారు బానెట్‌పై ఒక వ్యక్తిని సుమారు 2-3 కిలోమీటర్లు లాగారు. కాగా, కారు నడిపిన నిందితుడు బీహార్ ఎంపీ డ్రైవర్‌గా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఎంపీ డ్రైవర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించగా…
ఆదివారం ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ నుండి నిజాముద్దీన్ దర్గా వరకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు ఓ వ్యక్తి కారు బానెట్‌కు తగిలించుకుని వెళ్లాడు. కారు బీహార్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ చందన్‌సింగ్‌కు చెందినదని, ఆ కారు డ్రైవ్ చేసిన వ్యక్తి ఎంపీ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు.
కాగా, బాధితుడు.. తాను ఒక సాధారణ డ్రైవర్ అని, ఓ ప్రయాణికుడిని దింపి తిరిగి వస్తుండగా, తన పట్ల ఎంపీ డ్రైవర్ చేతన్ ఇలా ప్రవర్తించాడని బాధితుడు రాంచంద్ కుమార్ తెలిపాడు. తన కారును రాంచంద్ వచ్చి ఢీ కొట్టాడని, ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించినందుకు.. తనను కారు బ్యానెట్ పైకి నెట్టుకొని దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణించాడని బాధితుడు వాపోయాడు. తాను కారు ఆపమని ఎంత బతిమాలుకునప్పటికీ అతడు..మాట వినలేదని, కారు ఆపలేదని బాధితుడు పోలీసులకు వివరించాడు.
#WATCH | Delhi: At around 11 pm last night, a car coming from Ashram Chowk to Nizamuddin Dargah drove for around 2-3 kilometres with a person hanging on the bonnet. pic.twitter.com/54dOCqxWTh
— ANI (@ANI) May 1, 2023
ఈ కేసులో ర్యాష్ డ్రైవింగ్, ప్రాణహాని వంటి సెక్షన్ల కింద సన్‌లైట్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వాహనం రవీంద్ర సింగ్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ చేయబడిందని గుర్తించారు.
కాగా, నిందితుడు రాంచంద్ కుమార్ వాదన మరోలా ఉంది..తన కారు అతని కారును ఢీకొట్టలేదని చెప్పాడు. అతను ఉద్దేశపూర్వకంగా తన కారు బానెట్‌పైకి ఎక్కి నానా బీభత్సం చేశాడని ఎంపీ డ్రైవర్ చెబుతున్నాడు. తాను అతనిని దిగమని అడిగాను, అతను వినలేదు. నేను మళ్లీ నా కారు.” ఆపి, నువ్వు ఏం చేస్తున్నావు? అని నిలదీశానంటూ చెప్పుకొచ్చాడు. కాగా, పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..