AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మరీ ఇంత మతిమరుపా.. పసికందును కారుపై వదిలేసి వెళ్లిన తండ్రి.. చివరికి ఏమైందంటే..

వారి ఎరమపాటు తనం వల్ల అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.. వాటి వల్ల పిల్లలు బాధపడాల్సి వస్తుంది.. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే మీకు కూడా కోపం తెప్పిస్తుంది.

Watch: మరీ ఇంత మతిమరుపా.. పసికందును కారుపై వదిలేసి వెళ్లిన తండ్రి.. చివరికి ఏమైందంటే..
Father Forget Baby
Jyothi Gadda
|

Updated on: May 01, 2023 | 8:42 PM

Share

తల్లిదండ్రులుగా ఉండటం అంత తేలికైన పని కాదు. పిల్లలను పెంచడం, వారిలో సరియైన మర్యాదలు అలవర్చడం, వారి వ్యక్తిత్వాన్ని సరిగ్గా అభివృద్ధి చేయడం చాలా బాధ్యతాయుతమైన, కష్టమైన పని. అయితే, ఈ విషయంలో తల్లిదండ్రులందరూ పరిపూర్ణులు కాలేకపోతున్నారు. పిల్లలను పెంచేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు అనుభవాల నుండి ప్రతిరోజూ కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు తల్లిదండ్రులు కూడా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులు అవుతారు కానీ బాధ్యతగా ఉండలేకపోతున్నారు. వారి ఎరమపాటు తనం వల్ల అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.. వాటి వల్ల పిల్లలు బాధపడాల్సి వస్తుంది.. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే మీకు కూడా కోపం తెప్పిస్తుంది.

ఈ వీడియోలో, పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన కారులో ఒక వ్యక్తి తన నవజాత శిశువును కారు పైకప్పుపై ఉంచి మరచిపోయినట్టుగా తెలుస్తోంది. అంతే కాదు, అతను కారు సీటుపై శిశువు ఉండగానే కారు స్టార్ట్‌ చేసుకుని వెళ్లటం కూడా కనిపించింది. ఇది చూసిన జనాలు భయాందోళనకు గురై అతడిని ఆపేందుకు కేకలు వేశారు. ఇంతలో, కారు పైకప్పు నుండి శిశువు నెమ్మదిగా పడిపోయింది. అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి పాప ఉన్న ఊయల పైనుండి ఎత్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి కారును ఆపాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు వేల సంఖ్యలో వీడియోకి వ్యూస్‌ వచ్చాయి.. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా అప్పుడే పుట్టిన బిడ్డలను ఇలా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సరైందన్న ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..