కరెన్సీ నోట్లపై కనిపించే కట్టడాలు నిజంగా ఎక్కడున్నాయో తెలుసా..? ఎంతో చారిత్రక నేపథ్యం..
మరోవైపు, రూ.200 కరెన్సీ నోటు వెనుక మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ సాంచి స్థూపం ముద్రించబడిందని కూడా ట్వీట్ చేసింది. దీనిని క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించారు. అదేవిధంగా, రూ. 500 నోటు వెనుక ఢిల్లీలోని ప్రసిద్ధ, చారిత్రాత్మక ఎర్రకోట ఫోటో కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడింది.
గత రెండు సంవత్సరాలుగా ప్రజలు చాలా మంది ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతులకు మారారు. అయినప్పటికీ ఎక్కువమంది మాత్రం ఇప్పటికీ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు. కరెన్సీ నోటు జేబులో ఉంటే ఆ అనుభూతి వేరుగా ఉంటుందని అంటున్నారు. ఇకపోతే, కరెన్సీ నోట్లను నిశితంగా పరిశీలిస్తే ఈ నోట్లు దేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వం సంగ్రహావలోకనం కూడా ప్రదర్శిస్తాయి. కరెన్సీ నోట్లు భారతదేశంలోని ప్రసిద్ధ స్మారక చిహ్నాలు. ల్యాండ్‌మార్క్‌ల చిత్రాలను కలిగి ఉంటాయి. నోట్లపై ముద్రించిన చారిత్రక ప్రదేశాలను అన్వేషిస్తూ ట్విట్టర్ పోస్ట్ ఇటీవల వైరల్‌గా మారింది. దీనిని దేశీ థగ్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ‘భారత కరెన్సీ నోట్లపై చారిత్రక కట్టడాలు, సంఘటనలు ముద్రించబడ్డాయి’ అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.
కోణార్క్‌లోని సూర్య దేవాలయంతో సహా 10ప్రత్యేకతలు కరెన్సీ నోటుపై కనిపిస్తాయి. UNESCO ప్రకారం, ఇది సూర్య భగవానుడి రథానికి ఒక స్మారక చిహ్నం. దాని 24 చక్రాలు సింబాలిక్ డిజైన్‌లతో రూపొందించబడింది. ఆరు గుర్రాలతో నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది ఎల్లోరాలోని కైలాష్ దేవాలయాన్ని ప్రతిబింభిస్తుంది. ఇది రూ. 20 కరెన్సీ నోటుపై చిత్రీకరించబడింది. ఈ ఆలయం దేశంలోని అతిపెద్ద రాతి దేవాలయాలలో ఒకటి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. కర్నాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హంపి నుండి ఒక చారిత్రాత్మక రాతి రథం ఫ్లోరోసెంట్ బ్లూ రూ. 50 నోటులో కనిపించింది.
అలాగే, రూ. 100 కరెన్సీ నోటు గుజరాత్‌లోని రాణి కి వావ్‌ని సూచిస్తుంది. ఈ మెట్ల బావిని 1063లో చౌళుక్య వంశానికి చెందిన రాణి ఉదయమతి నిర్మించింది. మరోవైపు, రూ.200 కరెన్సీ నోటు వెనుక మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ సాంచి స్థూపం ముద్రించబడిందని కూడా ట్వీట్ చేసింది. దీనిని క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించారు. అదేవిధంగా, రూ. 500 నోటు వెనుక ఢిల్లీలోని ప్రసిద్ధ, చారిత్రాత్మక ఎర్రకోట ఫోటో కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడింది.
Historical Monuments and Events Printed on Indian Currency Notes
1. Konark Mandir – 10 Rs Note pic.twitter.com/NWkdxk9pky
— Desi Thug (@desi_thug1) April 28, 2023
అతిపెద్ద భారతీయ డినామినేషన్ నోటు రూ.2000. స్మారక చిహ్నం. అయితే ఇందులో ఓ మైలురాయి సంఘటన ఉందని చెప్పారు. మెజెంటా కలర్ నోట్ భారతదేశం మొదటి విజయవంతమైన మార్స్ మిషన్‌ను చూపుతుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..