AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంక వీళ్లు మారరా..? మెట్రోలో మినీ స్కట్‌తో యువతి హల్‌చల్‌..! వీడియో చూస్తే అవాక్కే..

ఈ వీడియో 2 మిలియన్ల వీక్షణలతో వైరల్‌గా మారింది. వీడియో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు యువతి చేసిన పనిని ప్రశంసించగా, మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై DMRC జరిమానా విధించాలని సూచించారు.

ఇంక వీళ్లు మారరా..? మెట్రోలో మినీ స్కట్‌తో యువతి హల్‌చల్‌..! వీడియో చూస్తే అవాక్కే..
Delhi Metro
Jyothi Gadda
|

Updated on: May 01, 2023 | 7:15 PM

Share

బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్సులు చేస్తూ రీళ్లు చేయడం ఇటీవలి కాలంలో బాగా ట్రెండ్‌ అవుతోంది. మనం ఎక్కడికి వెళ్లినా మాల్స్, పార్కులు, మెట్రోలు, రైళ్లు, రోడ్డు మార్గాల్లో రీళ్లు చేస్తూ యువతీ, యువకులు చేసే హంగామా మామూలుగా ఉండదు. వాళ్లు చేసే రీల్స్‌ ఎక్కువ వ్యూస్‌ కోసం కొందరు చేసే వింత ప్రవర్తన వల్ల తోటివారు ఇబ్బంది పడతారని కూడా మర్చిపోతున్నారు. అలాంటి వారికి పదే పదే ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ వారు మాత్రం మారటం లేదు. బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్, రీల్స్ షూటింగ్ చేస్తూ తోటి ప్రయాణికులు, ప్రజల ముందు వెకిలీ పనులు చేయటం మానటం లేదు. కొద్ది రోజులుగా ఢిల్లీ మెట్రోలో జరుగుతున్న సంఘటనలు అందరినీ ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. కొందరు అసభ్యకర ప్రవర్తనతో తోటి ప్రయాణికులను ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజుల క్రితం సెక్రటేరియట్ నుంచి హెచ్‌సీసీ వైపు వెళ్లే మెట్రోలో ఒక వ్యక్తి తన ప్యాంట్ ని విప్పాడు. అతని ప్రవర్తనతో మెట్రోలోని తోటి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఇలా తరచూ ఢిల్లీ మెట్రోలో కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా, ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) కూడా ప్రయాణీకులు బాధ్యతతో నడుచుకోవాలని ఒక ప్రకటన విడుదల చేసింది. మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరింది. ఇతర ప్రయాణీకులు ఏదైన అభ్యంతరకర ప్రవర్తనను గమనించినట్లయితే, వారు వెంటనే కారిడార్, స్టేషన్, సమయం మొదలైన వివరాలతో డీఎంఆర్‌సీ హెల్ప్‌లైన్‌లో విషయాన్ని తెలియజేయాలని కోరింది. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్‌ ఈ ప్రకటన విడుదల చేసిన రెండు రోజులకే మరో యువతి మెట్రోలో హల్‌చల్‌ చేసింది. ఢిల్లీ మెట్రో లోపల పంజాబీ ట్రాక్‌కి ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయగా వీడియో కాస్త వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియోలో, రెడ్ టాప్, గ్రే ప్లీటెడ్ స్కర్ట్ ధరించిన మహిళ ఢిల్లీ మెట్రో లో పంజాబీ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. క్లిప్‌లోని మహిళ itz_officialroyగా గుర్తించారు. వీడియో ఆమె అధికారిక Instagram హ్యాండిల్‌లో షేర్‌ చేసింది. క్యాప్షన్‌లో, ఆమె ఇలా రాసింది, “అవును ఇలాంటి వీడియోని డీఎంఆర్‌సీ ఒప్పుకోదని నాకు తెలుసు.. కానీ, ఢిల్లీ మెట్రోలో ఇలాంటి రీల్‌ చేయటం నాకు ఇదే ఫస్ట్‌ టైం అంటూ క్యాప్షన్‌లో రాసింది.

ఈ వీడియో 2 మిలియన్ల వీక్షణలతో వైరల్‌గా మారింది. వీడియో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు యువతి చేసిన పనిని ప్రశంసించగా, మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో నిబంధనలను ఉల్లంఘించిన వారిపై DMRC జరిమానా విధించాలని సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..