హిమాలయ మంచును ఐస్ క్రీంలా తింటున్న మహిళ.. వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పండి..
ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ఏది ఏమైనా మీరు జీవితంలో ఒక్కసారైనా హిమాలయాలను సందర్శించి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించాల్సిందే.

ఎండ వేడిమితో ఉక్కిరి బిక్కిరవుతున్న చాలా మంది ఐస్‌క్రీమ్‌కు నో చెప్పలేరు.. ముఖ్యంగా రాత్రిపూట ఐస్‌క్రీం తినే వారు చాలా మందే ఉంటారు. ఇప్పుడు హిమాలయ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి చల్లటి వాతావరణం వల్ల వణుకు పుడుతుంది. హిమాలయాలు చుట్టూ మంచు కుప్పలతో కప్పబడిన ప్రాంతం. అడుగు భూమి కూడా కనిపించకుండా అంతటా మంచుతో నిండి ఉంటుంది. విహారయాత్రకు వెళితే పొగమంచు, మంచు మధ్య గడపేందుకు చాలా మంది పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. అయితే, అంతటి చలిలో ఐస్ క్రీం తినడంలో ఉంటుంది అసలు మజా..! అంటోంది ఒక యువతి..
హిమాలయాలకు విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళ మంచుతో ఆడుకుంటూ అక్కడ ఉన్న తాజా మంచును పాలతో కలిపి ఐస్ క్రీం తయారు చేసింది. ఎముకలు కొరికే చలిలో, చుట్టూ మంచు కొండల నడుమ తాను తయారు చేసిన ఫ్రెష్ స్నో ఐస్‌క్రీం ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.




View this post on Instagram
ఇప్పటికే అంటు వ్యాధులు వ్యాపించి చాలా మందిని చంపినందున చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై ఘాటుగా స్పందించారు. ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ఏది ఏమైనా మీరు జీవితంలో ఒక్కసారైనా హిమాలయాలను సందర్శించి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించాల్సిందే.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
