Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: “అది జరిగి 15 ఏళ్లైనా.. ఇప్పటికీ చింతిస్తూనే ఉన్నా”.. కోహ్లి, గంభీర్ గొడవపై భారత మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..

Virat Kohli vs Gautam Gambhir: లక్నో వర్సెస్ బెంగళూరు మ్యాచ్‌ తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఒకరితో ఒకరు గొడవపడ్డారు. ఈ గొడవ పరిస్థితిపై హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Video: అది జరిగి 15 ఏళ్లైనా.. ఇప్పటికీ చింతిస్తూనే ఉన్నా.. కోహ్లి, గంభీర్ గొడవపై భారత మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
Virat Kohli Gautam Gambhir
Follow us
Venkata Chari

|

Updated on: May 02, 2023 | 4:33 PM

Virat Kohli-Gautam Gambhir Fight: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో 43వ మ్యచ్‌లో మే 1న లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్ హై-వోల్టేజ్‌గా మారింది. మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే సమయంలో, మ్యాచ్ ముగిసిన తరువాత, లక్నో సూపర్ జెయింట్‌కు చెందిన విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. విరాట్, గౌతమ్ మధ్య జరిగిన పోరు పరిస్థితిపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

15 ఏళ్లుగా చింతిస్తూనే ఉన్నా..

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన పోరు గురించి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వివరంగా చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ మ్యాచ్‌కి హర్భజన్ సింగ్ కామెంటరీ చేస్తున్నాడు. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్ అక్కడకు వెళ్లాడు. అటువైపు నుంచి విరాట్ కోహ్లీ నడుచుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. ఇది గౌతమ్ చేసిన తప్పా లేక నవీన్ చేసిన తప్పా అనేది పక్కన పెడితే.. దీనిపై నిరంతరం ప్రశ్నల వర్షం కురుస్తుందని హర్భజన్ చెప్పుకొచ్చాడు. ఈ పోరు ఇక్కడితో ఆగదు, ఎందుకంటే దీని గురించి చాలా మాట్లాడుకుంటారు. ఎవరు ఏమి మాట్లాడారు, ఎందుకు గొడవ జరిగింది అనే విషయాలు మొల్లగా వెల్లడవుతాయి. నాకు, శ్రీశాంత్‌తో పాటు ఒక సంఘటన జరిగింది. ఇది 2008లో ఇదే జరిగింది. కానీ, ఇప్పటికీ ఆ ఛాయలు పోలేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

“15 సంవత్సరాల తర్వాత కూడా, ఆ గొడవకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. హావభావాలు సరిగ్గా లేవు, ఆ సమయంలో నేను జరిగింది ఎల్లప్పుడూ సరైనదేనని భావించాను. కానీ, నేను చేసింది చాలా తప్పు” అంటూ చెప్పుకొచ్చాడు.

జరిమానా విధించిన బీసీసీఐ..

విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన పోరుపై దృష్టి సారించిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇద్దరికి జరిమానా విధించింది. బీసీసీఐ విరాట్ కోహ్లీకి 100 శాతం మ్యాచ్ ఫీజు అంటే రూ. 1.07 కోట్లు, గౌతమ్ గంభీర్‌కు 100 శాతం మ్యాచ్ ఫీజు అంటే రూ. 25 లక్షలు, నవీన్ ఉల్ హక్‌కు 50 శాతం మ్యాచ్ ఫీజు అంటే రూ. 1.79 లక్షల జరిమానా విధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన నేరాన్ని ముగ్గురు వ్యక్తులు అంగీకరించారు. అందువల్ల, ఈ విషయంపై తదుపరి విచారణ ఉండదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..