Virat Kohli: ‘ఇంత తల పొగరేంటి సామీ’.. కోహ్లీకి కౌంటర్‌గా నవీన్ ఇన్‌స్టా పోస్ట్..!
లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ పెద్ద వివాదానికి దారి తీసింది. విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య రాజుకున్న గొడవ..
లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ పెద్ద వివాదానికి దారి తీసింది. విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య రాజుకున్న గొడవ.. చిలికిచిలికి గాలివానలా మారింది. మైదానంలో వీరి మధ్య తలెత్తిన వాగ్వాదం.. చివరికి ఇన్‌స్టాలో కొనసాగుతోంది. మ్యాచ్ అనంతరం ‘మీరు ఏదైనా ఇవ్వగిలిగితే.. కచ్చితంగా తిరిగి తీసుకోగలిగే సత్తా ఉండాలి లేదంటే ఇవ్వకండి’ అని కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో చేసిన వ్యాఖ్యలకు నవీన్ ఇన్‌స్టాలో కౌంటర్ ఇచ్చాడు.
‘నీకు ఏం దక్కాలో అదే దక్కుతుంది. అలాగే ఉండాలి.. అలాగే జరుగుతుంది కూడా’ అని పోస్ట్ చేశాడు. ఇక దీనికి కోహ్లీ తన వెర్షన్‌ను ఇన్‌స్టా స్టోరీగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ‘మనం వినేదంతా నిజం కాదు. అది జస్ట్ ఒపీనియన్ మాత్రమే. అలాగే మనకు కనిపించేది కూడా నిజం కాదు. అది ఒక కోణం మాత్రమే’ అని కొటేషేన్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఇవి రెండూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, నిన్న మ్యాచ్ అనంతరం తర్వాత నవీన్, గంభీర్‌లతో కోహ్లీకి తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.
Naveen ul haq and Virat Kohli posted Insta stories today after the heated RCB vs LSG match! ?#naveenulhaq #gautamgambhir #viratkohli #rcb #lcg #ipl2023 #rivalry #cricketuniverse pic.twitter.com/GR0Wn6wXuJ
— Cricket Universe (@CricUniverse) May 2, 2023
మరోవైపు గతంలో బెంగళూరు వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు చేసిన ఓవర్ యాక్షన్ వల్లే.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రెండు క్యాచ్‌లు అందుకున్న తర్వాత, మ్యాచ్ గెలిచిన అనంతరం తన అగ్రెషన్ చూపించాడని కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
क्रिया की प्रतिक्रिया का नियम न्यूटन बाबा ही बता गए थे, लागू लगातार है। #KingKohli #ViratKohli #naveenulhaq #Gambhir #pooran #bishnoi #RCBVSLSG pic.twitter.com/7iWDjhWkd4
— Arshad Azmi (@arshadazmi143) May 2, 2023