Vande Bharat Train: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి.. కిటికీ అద్దాలు ధ్వంసం..!

రైల్లోని ప్రయాణికులు కిటికీ పగుళ్లను గుర్తించి లోకో పైలట్‌కు సమాచారం అందించారు. కానీ, రైలు అలాగే షోరనూర్ వరకు ప్రయాణాన్ని కొనసాగించింది. అక్కడ రైల్వే రక్షణ దళం నష్టాన్ని పరిశీలించింది. దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఓ బోగీకి సంబంధించిన కిటికీ అద్దం పగిలినట్లు పేర్కొంది.

Vande Bharat Train: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి.. కిటికీ అద్దాలు ధ్వంసం..!
Follow us
Jyothi Gadda

|

Updated on: May 02, 2023 | 4:14 PM

ప్రయాణికులకు అత్యంత మెరుగైన ప్రయాణ అనుభవం అందించేందుకు తీసుకువచ్చిన వందేభారత్ రైళ్లపై రాళ్లదాడి జరగడం నిత్యకృత్యంగా మారుతోంది. తాజాగా కేరళలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. సోమవారం తిరునావయ-తిరూర్ మధ్య గుర్తుతెలియని దుండగులు వందేభారత్‌ రైలుపై రాళ్లు రువ్వారు. రైలు కాసర్‌గడ్‌ నుంచి తిరువనంతపురానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రాళ్ల దాడితో రైలును తిరూర్ సమీపంలో అధికారులు నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత రైలు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించినట్లు అధికారులు తెలిపారు.

ఏప్రిల్ 25న కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం కాసర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వెళ్లే క్రమంలో రైలుపై రాళ్లదాడి జరిగింది. మలప్పురం జిల్లాలోని తిరుర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలును ఆపడానికి అనుమతించకపోవటంతో దాడి జరిగినట్టుగా తెలిసింది. రైల్లోని ప్రయాణికులు కిటికీ పగుళ్లను గుర్తించి లోకో పైలట్‌కు సమాచారం అందించారు. కానీ, రైలు అలాగే షోరనూర్ వరకు ప్రయాణాన్ని కొనసాగించింది. అక్కడ రైల్వే రక్షణ దళం నష్టాన్ని పరిశీలించింది. దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఓ బోగీకి సంబంధించిన కిటికీ అద్దం పగిలినట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..