AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కర్ణాటకలో డప్పు కొట్టిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మీరా మేమా అంటూ పోటాపోటిగా పార్టీల నేతలు  ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఇప్పటకే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమ మెనిఫెస్టోను విడుదల చేశాయి.

PM Modi: కర్ణాటకలో డప్పు కొట్టిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
Pm Modi
Aravind B
|

Updated on: May 02, 2023 | 4:12 PM

Share

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మీరా మేమా అంటూ పోటాపోటిగా పార్టీల నేతలు  ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఇప్పటకే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమ మెనిఫెస్టోను విడుదల చేశాయి. మంగళవారం రోజున ప్రధాని మోదీ కర్ణాటక చిత్రదుర్గ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసగించారు. ఈ క్రమంలోనే ఆయన వేదికపై ఉండగా సంప్రదాయ సంగీత వాయిద్యమైన డప్పు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఇండియా అభివృద్ధికి కర్నాటక రాష్ట్రాన్ని చోదక శక్తిగా మార్చాల్సిన అవసరం ఉందని సభలో ప్రధాని మోదీ అన్నారు. దాన్ని సాధించాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మళ్లీ రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. దేశంలో కర్నాటకను నెంబర్ 1 స్థానంలోకి తీసుకువచ్చేందుకు ఇందులో రోడ్‌మ్యాప్ ఉందని .. ఆధునిక మౌళిక సదుపాయల కోసం బ్లూప్రింట్ ఉందంటూ కొనియాడారు. అలాగే ఈ మేనిఫెస్టో మహిళలు, యువత సాధికారతపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 13న ఓట్లు లెక్కించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..