AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: రెండు రాష్ట్రాల విభజన అంశాల పిటీషన్‌ను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. తిరిగి వేసవి సెలవుల తర్వాతే..

వేసవి సెలవుల అనంతరం పిటిషన్ పై విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ విభజన చట్టాన్ని సవాల్‌ చేస్తూ పలు పిటీషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస కేంద్ర సహా మరి కొందరు ఈ పిటీషన్లను సుప్రీంకోర్టులో దాఖలు

Supreme Court: రెండు రాష్ట్రాల విభజన అంశాల పిటీషన్‌ను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. తిరిగి వేసవి సెలవుల తర్వాతే..
Andhra Pradesh And Telangana
Sanjay Kasula
|

Updated on: May 02, 2023 | 4:47 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. వేసవి సెలవుల అనంతరం పిటిషన్ పై విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ విభజన చట్టాన్ని సవాల్‌ చేస్తూ పలు పిటీషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస కేంద్ర సహా మరి కొందరు ఈ పిటీషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగ లేదని.. ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయనేది పిటీసన్లు కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఇదే అంశంపై జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ జరుపింది.

ఇవాళ వాడి వాడి వేడి వాదనలు జరిగాయి. అయితే మరోసారి విచారణను వాయిదా వేసింది కోర్టు. తిరిగి వేసవి సెలవుల తర్వాత మరోసారి వాదనలు ఉంటాయని తెలిపింది. గత వారం రోజుల క్రితం దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. అఫిడవిట్‌ను దాఖలు చేసింది. విభజన సహేతుకంగా చోటు చేసుకోకపోవడం, సుదీర్ఘకాలంగా పునర్విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించలేకపోవడం.. వంటి చర్యల వల్ల తాము నష్టపోతోన్నామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్, నిధుల-విధుల విభజన, ప్రత్యేక హోదా అంశాలను కూడా పిటీషన్‌లో పొందుపరిచారు పిటీషనర్లు.

ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ మహ్మఫూజ్ ఏ నాజ్కీ వాదించారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఆస్తుల పంపకాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. తమ వాటాగా దక్కాల్సిన మెజారిటీ ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉండిపోవడం, సకాలంలో పంపకాలు పూర్తికాకపోవడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పిటీషన్‌లో అభ్యర్థించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Follow Us
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
రవితో రాహువు యుతి.. ఆ రాశుల వారికి కొత్త జీవితం..!
రవితో రాహువు యుతి.. ఆ రాశుల వారికి కొత్త జీవితం..!