AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విచిత్ర రూపం… ప్రేమ అపరిమితం..ప్రపంచ వికృత కుక్క జిన్నీ లూ!

చూడటానికి విచిత్రంగా , కాస్త భిన్నంగా కనిపించినంత మాత్రాన మూగజీవాలు పంచే ప్రేమ ఏ మాత్రం తగ్గదు ఈ సందేశాన్ని చాటిచెబుతూ 50 ఏళ్లుగా  జరుగుతున్న పోటీలలో ఈ ఏడాది విజేతగా నిలిచింది "జిన్నీ లూ" అనే 6 ఏళ్ల పగ్. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా రోసా వేదికగా జరిగింది 2026 వర్ల్డ్స్ అగ్లీయెస్ట్ డాగ్ కాంటెస్ట్.

విచిత్ర రూపం... ప్రేమ అపరిమితం..ప్రపంచ వికృత కుక్క జిన్నీ లూ!
Pug Jinny Wins 2026 World's Ugliest Dog Contest
Sharada V
|

Updated on: Aug 17, 2026 | 8:09 PM

Share

చూడటానికి విచిత్రంగా , కాస్త భిన్నంగా కనిపించినంత మాత్రాన మూగజీవాలు పంచే ప్రేమ ఏ మాత్రం తగ్గదు ఈ సందేశాన్ని చాటిచెబుతూ 50 ఏళ్లుగా  జరుగుతున్న పోటీలలో ఈ ఏడాది విజేతగా నిలిచింది “జిన్నీ లూ” అనే 6 ఏళ్ల పగ్. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా రోసా వేదికగా జరిగిన 2026 వర్ల్డ్స్ అగ్లీయెస్ట్ డాగ్ కాంటెస్ట్ లో పగ్‌ జాతి కుక్క విజేతగా గెలిచి వార్తల్లో కెక్కింది. ఈసారి 50వ వార్షికోత్సవ పోటీ కూడా కావడంతో ప్రత్యేకతను  సంతరించుకుంది.

నాల్గవసారి ప్రయత్నించి… గెలిచి చూపించింది!

జిన్నీ లూ యజమానురాలు మిషెల్ గ్రాడీ ప్రకారం, ఈ టైటిల్ కోసం జిన్నీ లూ పోటీ పడటం ఇది నాలుగోసారి. ఈ వేదికపై అందరినీ కలవడం, సందడి చేయడం ఈ డాగ్‌కు ఎంతో ఇష్టమని ఆమె అన్నారు . అంతర్జాతీయ పోటీలో విజేతగా నిలిచినందుకు జిన్నీ లూ యజమానురాలిగా ఆమెకు 5,000 డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 4.77 లక్షలు క్యాష్‌ ప్రైజ్ లభించింది. నాలుగేళ్ల క్రితం ‘పగ్ రెస్క్యూ’ సంస్థ నుంచి మిషెల్ గ్రాడీ కుక్కను దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఇంటా బయటా అల్లరి చేస్తూ,  ఎనలేని సంతోషాన్ని పంచుతోందని ఆమె తెలిపారు.

అవమానించడం కాదు… ప్రేమించడం నేర్పడమే లక్ష్యం!

పేరుకు “అత్యంత వికృత కుక్కల” పోటీ అయినప్పటికీ, ఏ ప్రాణినీ హేళన చేయడం జరగదనీ బాహ్య సౌందర్యం కంటే అంతర్గత సౌందర్యం గొప్పదనే సందేశాన్ని ప్రపంచానికి చాటడమే ఈవెంట్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

సోనోమా-మెరిన్ అగ్రికల్చరల్ అసోసియేషన్ సీఈఓ మాండీ క్లెండెనెన్ మాట్లాడుతూ, “ఈ పోటీ లక్ష్యం ఎప్పుడూ వికృతమైన కుక్కను వెతకడం కాదు. 50 ఏళ్లుగా ప్రతి శునకంలో ఉన్న ప్రత్యేకతను వేడుకగా జరుపుకోవడమే. వీధి కుక్కలతో పాటు అనాథలుగా మారిన మూగజీవులను పౌరులు దత్తత తీసుకోవాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యం” అన్నారు. అప్పట్లో చిన్నగా  మొదలైన వేడుక, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోవడం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

Follow Us