AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

October 2026: అక్టోబర్ మాసంలో ఈ నక్షత్రాల వారికి అదృష్ట యోగాలు..!

October 2026 Nakshatra Horoscope: అక్టోబర్ నెలలో ఆరు నక్షత్రాల వారికి అదృష్టం బాగా కలిసిరానుంది. కొన్ని నక్షత్రాల వారు గ్రహ సంచారం ప్రభావంతో రాజయోగాలు, ధనయోగాలు పొందే అవకాశం ఉంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరడంతో పాటు ఆరోగ్యంలో మెరుగుదల, సమస్యలు, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభించవచ్చు. సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. ఆదాయం పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.

October 2026: అక్టోబర్ మాసంలో ఈ నక్షత్రాల వారికి అదృష్ట యోగాలు..!
Star Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 29, 2026 | 4:06 PM

Share

అక్టోబర్ నెలలో కొన్ని నక్షత్రాల వారు ఒక వెలుగు వెలగబోతున్నారు. మొత్తం 27 నక్షత్రాల్లో ఆరు నక్షత్రాల వారు అనూహ్యంగా అందలాలు ఎక్కబోతున్నారు. అశ్విని, మృగశిర, స్వాతి, మూల, ధనిష్ఠ, రేవతి నక్షత్రాల వారికి అనేక విధాలైన అదృష్టాలు కలిగే అవకాశం ఉంది. గ్రహసంచారం రీత్యా వీరికి రాజ యోగాలు, ధన యోగాలతో పాటు, మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెర వేరడం, ఆరోగ్య భాగ్యం కలగడం, కొన్ని సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడడం జరుగుతుంది. ఈ నక్షత్రాల వారికి తప్పకుండా సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ఈ నక్షత్రాలవారు ఆదాయ వృద్దికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది.

అశ్విని

కేతువు అధిపతిగా ఉన్న ఈ నక్షత్రం మేష రాశిలో ఉన్నందువల్ల ఈ నెలంతా ఈ నక్షత్రంవారికి ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తూనే ఉంటుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగు తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగు తుంది.

మృగశిర

కుజుడికి సంబంధించిన ఈ నక్షత్రం వృషభ, మిథున రాశులకు విస్తరించి ఉన్నందువల్ల ఈ నక్ష త్రంలో పుట్టిన వారి దశ తిరుగుతుంది. జీవన శైలి ఉన్నత స్థాయికి చేరుతుంది. ఉద్యోగంలో పదో న్నతులతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతాన యోగం పడుతుంది. అనేక వైపుల నుంచి ఆదా యం వృద్ది చెందుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

స్వాతి

రాహువుకు చెందిన ఈ నక్షత్రం తులారాశిలో ఉన్నందువల్ల ఈ నక్షత్రం వారికి అక్టోబర్ లో రాజయోగాలు, ధన యోగాలు ఎక్కువగా కలుగుతాయి. వీరు తప్పకుండా ఐశ్వర్యవంతులవు తారు. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. రావలసిన మసొమ్మంతా చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి బాగా కలిసి వస్తుంది.

మూల

ఈ నక్షత్రానికి కేతువు అధిపతి కావడం, ధనూ రాశిలో ఉండడం, కేతువు సింహ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ నక్షత్రం వారికి అనేక పర్యాయాలు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. పట్టిం దల్లా బంగారం అవుతుంది. అనారోగ్యానికి తగ్గ వైద్య చికిత్స లభిస్తుంది. మదుపులు, పెట్టుబ డులు రెట్టింపు లాభాలనిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగు తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి తప్పకుండా ఉన్నత స్థితికి చేరుతుంది.

ధనిష్ఠ

కుజుడికి చెందిన ఈ నక్షత్రం మకర, కుంభ రాశుల్లో ఈ నెల ఒక వెలుగు వెలగబోతోంది. ఈ నక్ష త్రానికి చెందిన వారు ఏ రంగంలో ఉన్నా అందలాలు ఎక్కుతారు. ఒక సంస్థకు ఉన్నతాధికారి లేదా సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరగ డంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల కూడా లాభాలు బాగా పెరుగుతాయి.

రేవతి

బుధ గ్రహానికి చెందిన ఈ నక్షత్రం మీన రాశిలో బాగా ప్రకాశించబోతోంది. ఈ నక్షత్రం వారికి రాజయోగాలు కలగబోతున్నాయి. రాజకీయాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం విశే షంగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

Disclaimer: జ్యోతిష్యానికి సంబంధించిన ఈ వివరాలు సాధారణ నమ్మకాలు, జ్యోతిష్య అంచనాల ఆధారంగా మాత్రమే అందించబడుతున్నాయి. ఇవి శాస్త్రీయంగా నిరూపితమైనవి కావు.

Follow Us