Andhra News: ఒక్కసారిగా కార్మికులపై పడిపోయిన క్రేన్.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
తిరుపతిలో ఘోరం ప్రమాదం వెలుగు చూసింది. డీబీఆర్ రోడ్డులో ఓ ప్రైవేట్ హోటల్ నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో క్రేన్ కింద పడి అక్కడ పనిచేస్తున్న ముగ్గురి మృతి కార్మికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుపతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డీబీఆర్ రోడ్డులో ఓ ప్రైవేట్ హోటల్ నిర్మాణ పనులు జరుగుతుండగా భారీ క్రేన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగి గుంతలో పడిపోయింది. దీంతో క్రేన్ కింద చిక్కుకొని ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కార్మికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను రుయా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తర్వాత మరణించిన వారి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతుల వివరాలు సేకరించపనిలో ఉన్నారు. అలాగే ఆ స్థలం ఎవరిది.. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద సమయంలో ఏం జరిగింది అనేది తెలుసుకునేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తున్నారు. అలాగే ప్రమాద స్థలంలో ఉన్న క్రేన్‌ను తొలగించే పనలు మొదలు పెట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,
