వీరికి విషమే.. సీతాఫలం ఎవరు తినకూడదంటే?

samatha

6 November 2026

Pic credit - Pinterest

సీతాఫలం సీజన్ వచ్చేసింది. ప్రతి ఒక్కరికీ సీతా ఫలం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే దీని రుచి అంత అద్భుతంగా ఉంటుంది.

సీతాఫలం

ఇక చిన్న పిల్లలకు కూడా సీతాఫలం అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ ఇందులో ఉండే గింజల కారణం వారు తినడానికి అంతగా ఆసక్తి చూపరు.

చిన్న పిల్లలు

కానీ సీతాఫలం తినడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సీజనల్ ఫ్రూట్ రోజుకు ఒకటి తిన్నా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

బోలెడు ప్రయోజనాలు

అయితే ఇది ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ కొంత మంది మాత్రం దీనిని అస్సలే తినకూడదంట. కాగా ఎవరు దీనిని తినకూడదో మనం చూద్దాం.

ఆరోగ్యానికి మేలు

మధుమేహం ఉన్న వారు అస్సలే సీతాఫలం తినకూడదు. ఇందులో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

మధుమేహం

అలాగే జలుబు దగ్గు ఉన్నవారు అస్సలే సీతాఫలం తినకూడదు. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు సీతాఫలం తినడం మంచిది కాదు.

జలుబు, దగ్గు

అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా వీలైనంత వరకు సీతాఫలం తినకపోవడమే మంచిది.

జీర్ణ సమస్యలు

అలాగే పిల్లలకు సీతాఫలం ఇవ్వకూడదు. ఎందుకంటే దీని గింజలు చాలా పొడవుగా పెద్దగా ఉంటాయి. పొరపాటున గొంతులోకి వెళ్లితే ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది.

పిల్లలకు