శాంసంగ్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్! సూపర్ ఫీచర్లతో కొత్త గ్యాడ్జెట్స్ తెచ్చేస్తున్న టెక్ దిగ్గజం
Samsung.. ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తమ వినియోగదారుల ముందుకు మరికొన్ని కొత్త పరికరాలను తీసుకురావడానికి ముమ్మరంగా సిద్ధమవుతోంది. టెక్ ప్రపంచంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ లేటెస్ట్ గ్యాడ్జెట్లు త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఇందులో భాగంగా గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ ట్యాబ్ ఎస్12 ప్లస్ తో పాటు బడ్జెట్ రేంజ్‌లో గెలాక్సీ ఏ07ఎస్ పరికరాలు గూగుల్ ప్లే కన్సోల్ సపోర్టెడ్ డివైసెస్ లిస్ట్‌లో దర్శనమిచ్చాయి. ఈ సర్టిఫికేషన్ల ద్వారా టెక్ ప్రియుల్లో సరికొత్త ఆసక్తి మొదలైంది.

శాంసంగ్ సంస్థ గెలాక్సీ S26 FE, ట్యాబ్ S12+, బడ్జెట్ రేంజ్ A07s పరికరాలను మార్కెట్లోకి తీసుకురానుంది. గూగుల్ ప్లే కన్సోల్ మరియు వివిధ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించిన ఈ కొత్త గ్యాడ్జెట్లు టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే వీటి అధికారిక లాంచ్ డేట్ వెల్లడయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో సంచలనాలు సృష్టించడానికి వస్తున్న ఈ అద్భుతమైన కొత్త డివైజెస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గెలాక్సీ S26 FE వేరియంట్లు
శాంసంగ్ సంస్థ తమ పాపులర్ ఫ్యాన్ ఎడిషన్ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S26 FEని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తోంది. ఈ మోడల్ వివిధ దేశాలకు అనుగుణంగా ఐదు విభిన్న మోడల్ నెంబర్లతో గూగుల్ ప్లే కన్సోల్‌లో నమోదైంది. ముఖ్యంగా అమెరికా, కెనడా, దక్షిణ కొరియా అలాగే అంతర్జాతీయ మార్కెట్ల కోసం ప్రత్యేక వేరియంట్లను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మిగతా ఫీచర్లు మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడకాలేదు. త్వరలోనే ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.
అలాగే టాప్‌ఎండ్ ట్యాబ్లెట్ ప్రియుల కోసం రాబోతున్న గెలాక్సీ ట్యాబ్ S12+ రెండు వేరియంట్లలో లభించనుంది. ఇది కేవలం వైఫై మాత్రమే కాకుండా 5జీ సపోర్ట్‌తో కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే భారత్‌కు చెందిన బీఐఎస్ (BIS) తో పాటు అమెరికా, దక్షిణ కొరియా సర్టిఫికేషన్ సంస్థల వద్ద ఈ ట్యాబ్ కనిపించింది. వరుసగా సర్టిఫికేషన్లు అన్నీ పూర్తివుతుండటంతో దీని లాంచ్ చాలా దగ్గరలోనే ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
లాంచ్ వివరాలు
తక్కువ ధరలో నమ్మకమైన కొత్త ఫోన్ కోరుకునే వారి కోసం శాంసంగ్ గెలాక్సీ A07s మోడల్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేస్తోంది. గూగుల్ లిస్టింగ్‌లో కనిపించిన ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లతో పాటు లాటిన్ అమెరికా వినియోగదారులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని రూపొందుతోంది. అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లతో బడ్జెట్ విభాగంలో గట్టి పోటీనిచ్చేలా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.
ఈ డివైజెస్‌కు సంబంధించిన వివరాలు, సర్టిఫికేషన్లు అన్నీ బయటకు వచ్చినప్పటికీ, శాంసంగ్ సంస్థ ఇప్పటివరకు వీటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ఈ ఫోన్లు మరియు ట్యాబ్లెట్ల ధరలు, పూర్తి ఫీచర్లు అలాగే ఇవి మార్కెట్లోకి ఎప్పుడు విడుదలవుతనే విషయాలపై కంపెనీ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ నుంచి రాబోతున్న ఈ కొత్త పరికరాలు మార్కెట్లో ఎలాంటి విజయాలను నమోదు చేస్తాయో వేచి చూడాలి.
