మెదడుకు కావాలి సెలవు! ఇలా  చేస్తే బ్రెయిన్ బర్నౌట్‌కు చెక్

17-08-2026

Pic credit - Instagram

Phani Ch

రోజంతా విశ్రాంతి లేకుండా పనిచేసేది మన మెదడే! ఉదయం నిద్రలేవక ముందే మొదలై, రాత్రి నిద్రలోనూ ఆలోచిస్తూనే ఉంటుంది.

కేవలం శరీరానికే కాదు, అలసిపోయిన మెదడుకు కూడా తప్పనిసరిగా ఒక సెలవు కావాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా, 24 గంటల డిజిటల్ ఒత్తిడి వల్ల మెదడు బర్నౌట్‌కు గురవుతోంది. చిన్న విషయాలకే చిరాకు రావడం, పనులను వాయిదా వేయడం, ఏకాగ్రత తగ్గడం అనేవి మెదడు అలసిపోయిందనడానికి సంకేతాలు.

బ్రెయిన్ హాలిడే అంటే కొండెక్కి ధ్యానం చేయడం మాత్రమే కాదు. కాసేపు మెదడుకు ఏ పనీ అప్పగించకుండా ప్రశాంతంగా వదిలేయడమే అసలైన సెలవు.

కేవలం ఫోన్ పక్కన పెడితే సరిపోదు! ఫోన్ మన చేతిలో ఉన్నంతసేపు అది ఆఫీస్, సినిమా హాల్, న్యూస్ చానల్స్ మరియు షాపింగ్ మాల్‌గా మారి మన మెదడును నిరంతరం బిజీగా ఉంచుతోంది.

ఒకప్పుడు కాస్త ఖాళీ సమయం దొరికితే ప్రశాంతంగా కూర్చునేవాళ్లం. కానీ ఇప్పుడు రెండు నిమిషాలు ఖాళీగా ఉంటే చాలు.. వెంటనే ఫోన్ చేతిలోకి వచ్చేస్తోంది.

ట్రిప్‌కి వెళ్లి మరో పనిలా టెన్షన్ పడొద్దు! హాలిడే వెళ్లినప్పుడు కూడా ఈమెయిల్స్ చూడటం, రీల్స్ పోస్ట్ చేయడం, ఫోటోల కోసమే సమయం కేటాయిస్తే మెదడు మరింత అలసిపోతుంది.

ప్రయాణానికి చివరి నిమిషంలో టికెట్లు, హోటళ్ల గందరగోళం మెదడుపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. ప్రణాళిక సిద్ధంగా ఉంటేనే మనసుకు హాయిగా ఉండే హాలిడే ఫీలింగ్ కలుగుతుంది.