ఒక్క దీపం మీ జీవితాన్ని మార్చేస్తుంది.. శ్రావణ శుక్ర వారం చేయాల్సిన పని ఇదే
Samatha
17 August 2026
శ్రావణ శుక్రవారం వచ్చేస్తుంది. అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. శివుడికి చాలా ప్రీతకరమైన మాసం అంటారు.
ఇక ఈ మాసం మొత్తం పూజలు, వ్రతాలు ఎక్కువగా చేస్తుంటారు. నిండు మనుసుతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.
అయితే ఈ శ్రావణ శుక్రవారం ఇలా తులసి కోట వద్ద దీపం పెడితే, అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అన్నివిధాలుగా కలిసి వస్తుందంట.
శ్రావణ శుక్ర వారం ఉదయాన్నే నిద్ర లేచి, ఇంటిని శుభ్ర పరిచి, అందంగా రంగు రంగుల ముగ్గులతో అలంకరించాలి.
ముఖ్యంగా తులసి కోటను శుభ్రపరిచి, తులసి చెట్టు వద్ద ముగ్గులు వేయాలి. రంగు రంగుల పూలతో అలంకరించి, మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి శుభ్రమైన వత్తిని వేసి దీపం వెలిగించాలి.
ఉదయం దీపం వెలిగించడమే కాకుండా, సాయం కాలం కూడా దీపం వెలిగించడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు.
ముఖ్యంగా శ్రావణ శుక్రవారం సాయంకాలంలో తులసి పూజ చేసి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలంట.
ఇలా చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంతే కాకుండా అన్నివిధాలుగా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు.