AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త టెక్నాలజీతో మార్కెట్‌లోకి ఏఐ ఇయర్‌‌బడ్స్! ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే

Tecno Pova AI Buds Pro.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో తన సబ్‌బ్రాండ్ పోవా ద్వారా భారత్‌లో అత్యంత ఆధునిక ఏఐ ఫీచర్లతో సరికొత్త ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. సాధారణంగా కేవలం ఖరీదైన, ప్రీమియం ఇయర్‌బడ్స్‌లో మాత్రమే కనిపించే ఎన్నో హై-ఎండ్ ఫీచర్లను ఇందులో ఎంతో నిపుణతతో పరిచయం చేశారు. ఆఫీస్ ఉద్యోగులను, టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ లేటెస్ట్ డివైజ్ మార్కెట్లో ట్రెండింగ్‌లో నిలిచింది.

కొత్త టెక్నాలజీతో మార్కెట్‌లోకి ఏఐ ఇయర్‌‌బడ్స్! ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే
Tecno Pova Ai Buds Pro
Nikhil
|

Updated on: Aug 17, 2026 | 8:20 PM

Share

టెక్నో సంస్థ పోవా ఏఐ బడ్స్ ప్రోను భారత్‌లో విడుదల చేసింది. రూ.12,499 ప్రారంభ ధరతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌లో ఏఐ రికార్డింగ్, మీటింగ్ సమ్మరీస్, 78 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించారు. ఆగస్టు 22 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. సరికొత్త సాంకేతికతతో వస్తున్న ఈ పవర్​ఫుల్ ఇయర్‌బడ్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రియల్‌టైమ్ ట్రాన్స్‌లేషన్

ఈ కొత్త పోవా ఏఐ బడ్స్ ప్రోలో అత్యంత ముఖ్యమైనది ఏఐ పవర్డ్ రికార్డింగ్ ఫీచర్. ఛార్జింగ్ కేస్‌పై ప్రత్యేకంగా ఇచ్చే రెడ్ కలర్ ‘క్విక్ నోట్’ బటన్ నొక్కడం ద్వారా ఫోన్‌తో పనిలేకుండానే నేరుగా 4 గంటల వరకు ఆడియోను సులభంగా రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ అయిన మాటలను ఉచితంగా టెక్స్ట్‌గా మార్చడంతో పాటు, సుదీర్ఘంగా జరిగిన మీటింగ్స్‌ను ఏఐ ద్వారా క్లుప్తంగా సమరైజ్ చేసి ఇస్తుంది. ఆఫీస్ మీటింగ్స్‌కు తరచూ హాజరయ్యే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే ఇందులో మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏమిటంటే, ఏకంగా 78 భాషల్లో లైవ్ ఆడియోను రికార్డ్ చేసి రియల్‌టైమ్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఇతర భాషలు మాట్లాడే వారితో సంభాషించేటప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ డేటా అంతా పూర్తిగా వినియోగదారుల నియంత్రణలోనే ఉంటుందని, ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదని కంపెనీ స్పష్టం చేసింది. ఆగస్టు 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ బడ్స్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.

ఇతర ఆధునిక ఫీచర్లు

స్పష్టమైన ఆడియో, నాణ్యమైన కాల్స్ కోసం ఇందులో 8 మైక్రోఫోన్లు, 48dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌ను అమర్చారు. ఒకే సమయంలో రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే డ్యూయల్ కనెక్టివిటీ సదుపాయం కూడా దీని సొంతం. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా 40 గంటల పాటు నిరంతరం పనిచేసే బ్యాటరీ లైఫ్‌ను ఇది అందిస్తుంది.

దీంతో పాటు టైప్-సి ఛార్జింగ్‌తో పాటు క్యూఐ (Qi) వైర్‌లెస్ ఛార్జింగ్, IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. పవర్‌ఫుల్ ఏఎన్‌సీ, మీటింగ్ రికార్డింగ్స్, ట్రాన్స్‌లేషన్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ పోవా ఏఐ బడ్స్ ప్రో, ఇండియన్ ఇయర్ బడ్స్ మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. అసలు ధర రూ.14,999 కాగా ఆఫర్ ధరలో రూ.12,499కే లభించడం విశేషం.

Follow Us