Watch Video: గుండెలు పిండేస్తున్న దృశ్యం.. తల్లికోసం తల్లడిల్లుతున్న పసి హృదయం..

మనుషులైనా.. జంతువులైనా.. తల్లి, బిడ్డల బంధాన్ని వర్ణించలేం. ఏ తల్లీ తన బిడ్డను విడిచి ఉండలేదు.. ఏ బిడ్డా తన తల్లిని విడిచి ఉండలేదు.. ఒకవేళ అలాంటి విపత్కర పరిస్థితే ఎదురైతే.. ఆ దృశ్యాన్ని చూడటం ఎవరితరం కాదు. కానీ, అలాంటి గుండెలు పిండేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Watch Video: గుండెలు పిండేస్తున్న దృశ్యం.. తల్లికోసం తల్లడిల్లుతున్న పసి హృదయం..
Rihno
Follow us
Shiva Prajapati

|

Updated on: May 02, 2023 | 2:18 PM

మనుషులైనా.. జంతువులైనా.. తల్లి, బిడ్డల బంధాన్ని వర్ణించలేం. ఏ తల్లీ తన బిడ్డను విడిచి ఉండలేదు.. ఏ బిడ్డా తన తల్లిని విడిచి ఉండలేదు.. ఒకవేళ అలాంటి విపత్కర పరిస్థితే ఎదురైతే.. ఆ దృశ్యాన్ని చూడటం ఎవరితరం కాదు. కానీ, అలాంటి గుండెలు పిండేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు కన్నీటిపర్యంతం అవుతున్నారు. కొందరు దుర్మార్గుల తమ స్వార్థం కొద్ది చేసిన పనికి.. ఓ చిన్ని రైనో ఒంటరిదైంది. లోకాన్ని వీడిన తల్లి కోసం.. తల్లడిల్లిపోయింది. తల్లిని తడుముతూ.. ‘లే అమ్మ’ అన్నట్లుగా అటూ ఇటూ తిరగడం.. అందరి మనసులను కలచివేస్తోంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతనంద ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయింది.

వియాత్నం, చైనాలో ఖడ్గ మృగాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆ కారణంగానే వేటగాళ్లు వాటిని వేటాడుతారు. తాజాగా కొందరు వేటగాళ్లు ఖడ్గ మృగం కోసం ఉచ్చు పెట్టగా.. అందులో చిక్కుకుని ఓ భారీ ఖడ్గ మృగం ప్రాణాలు కోల్పోయింది. అయితే, దానికి ఒక చిన్న పిల్ల కూడా ఉంది. ఆ పిల్ల రైనో.. చనిపోయిన తల్లి రైనో వద్ద అటూ ఇటూ తిరుగుతూ.. తల్లిని లేపేందుకు ప్రయత్నించింది. అయితే, తల్లి మరణించదని గ్రహించలేని ఆ చిన్నారి రైనోని చూస్తే కంటతడి పెట్టని వారు ఉండరు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను కంటతడిపెట్టిస్తుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను కింద చూడొచ్చు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..