AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి భారత సర్కార్ భరోసా.. ఎప్పటి వరకు ఎంత మందిని తీసుకువచ్చారంటే..!

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం కొనసాగుతోంది. అమెరికాతో చర్చించేదిలేదన్న ఇరాన్‌ మంకుపట్టు కారణంగా గల్ఫ్‌లో ఇప్పటికీ అవే టెన్షన్లు. ఇప్పటివరకు యుద్ధంలో 1,300 మందికిపైగా చనిపోయారు. గల్ఫ్‌ దేశాలకు ఇరాన్ క్షమాపణలు చెప్పి, దాడులు చెయ్యబోమని ఇరాన్ హామీనిచ్చినా.. జనానికి పరేషాన్లు తప్పడం లేదు. ముఖ్యంగా యుద్ధ ప్రభావం ఉన్న భారతీయులు స్వదేశం బాట పడుతున్నారు.

గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి భారత సర్కార్ భరోసా.. ఎప్పటి వరకు ఎంత మందిని తీసుకువచ్చారంటే..!
Indians Brought Back From Gulf
Balaraju Goud
|

Updated on: Mar 08, 2026 | 9:40 PM

Share

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం కొనసాగుతోంది. అమెరికాతో చర్చించేదిలేదన్న ఇరాన్‌ మంకుపట్టు కారణంగా గల్ఫ్‌లో ఇప్పటికీ అవే టెన్షన్లు. ఇప్పటివరకు యుద్ధంలో 1,300 మందికిపైగా చనిపోయారు. గల్ఫ్‌ దేశాలకు ఇరాన్ క్షమాపణలు చెప్పి, దాడులు చెయ్యబోమని ఇరాన్ హామీనిచ్చినా.. జనానికి పరేషాన్లు తప్పడం లేదు. ముఖ్యంగా యుద్ధ ప్రభావం ఉన్న భారతీయులు స్వదేశం బాట పడుతున్నారు. ప్రభుత్వం కూడా డిపోర్టేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది.

వార్‌జోన్‌లో చిక్కుకున్న భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్యాక్ టు భారత్ అంటున్నారు. మిడిలీస్ట్‌లోని కొన్ని దేశాలు ఎయిర్‌స్పేస్‌ని పాక్షికంగా ఓపెన్‌ చేవడం, విమానాల రాకపోకలు పునరుద్ధరించడంతో భారతీయులను వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతమైంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి వారం రోజుల్లో గల్ఫ్ దేశాల నుంచి 52 వేల మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చినట్టు లెక్క తేల్చింది విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.

మార్చి 1 నుంచి 7 వరకు కమర్షియల్ ఫ్లయిట్లు, నాన్‌-షెడ్యూల్డ్ రెస్క్యూ ఫ్లయిట్లు.. మొత్తం 280 మిమానాల్లో భారతీయుల తరలింపు జరిగింది. విమానాలు అందుబాటులో లేనివారి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున హెల్ప్‌లైన్లు, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. విదేశాల్లో ఉన్న భారతీయు భద్రత, సంక్షేమమే ఫస్ట్ ప్రయారిటీగా పనిచేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న భారత దౌత్య బృందాలు, లోకల్ అథారిటీస్‌తోను, కమ్యూనిటీ గ్రూప్స్‌తోనూ టచ్‌ ఉన్నాయి.

కానీ, ప్రపంచవ్యాప్తంగా యుద్ధభయం ఆవరించిన 15 దేశాల్లో భారతీయుల ఉనికి ఉంది. అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 35 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానం సౌదీ అరేబియా. దాదాపు పాతిక లక్షలమంది సౌదీలో చిక్కున్నారు. కతార్, కువైట్‌లో కూడా పదేసి లక్షల మంది భారతీయులు వర్క్‌ వీసా మీద ఉన్నారు. మొత్తం 15 దేశాల్లో కోటీ పది లక్షల మంది వార్‌జోన్‌లో చిక్కుకున్నట్టు లెక్కుంది.

గల్ఫ్ ప్రాంతంలో భవననిర్మాణం, హాస్టిటల్స్, ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి వెళ్లిన ఇండియన్స్ మిలియన్ల సంఖ్యలో ఉంటారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డప్పుడు వాళ్లందరి భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఉద్యోగభద్రత లేక, భారతదేశానికి తిరిగొచ్చే మార్గం తెలీక సతమతమయ్యే ఇండియన్స్‌కి బాసటగా నిలుస్తోంది భారత ప్రభుత్వం. కానీ, ప్రస్తుతానికి 52 వేలమందిని మాత్రమే వెనక్కు తీసుకొచ్చారు. యుద్ధభయం మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగితే కోటిమందికీ ఫ్లయిట్లు సిద్ధం చేయక తప్పదేమో!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us