Largest Tulip Gardens: భూతల స్వర్గం.. తులిప్ అందాలను చూడాలంటే ఇక్కడ ఈ దేశానికి వెళ్లాల్సిందే..

నెదర్లాండ్స్‌ను తులిప్‌ల భూమి అని పిలుస్తారు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద తులిప్ తోట ఉంది. ఈ తోట పేరు- కుకెన్‌హాఫ్. అవును ఇంద్రధనస్సు నేలమీదకు దిగివచ్చిందా అన్న చందంగా ఇక్కడ తులిప్ పువ్వులు కనువిందు చేస్తాయి.

Largest Tulip Gardens: భూతల స్వర్గం.. తులిప్ అందాలను చూడాలంటే ఇక్కడ ఈ దేశానికి వెళ్లాల్సిందే..
Tulip Garden In Netherlands
Follow us
Surya Kala

|

Updated on: May 08, 2023 | 7:54 AM

బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో సాంగ్స్ ను అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తారు. కొన్ని కొన్ని సాంగ్స్ ను.. వాటి పరిసరాలను ఎన్నటికీ మరచిపోము. అమితాబ్ బచ్చన్ , రేఖ సూపర్ హిట్ సాంగ్ దేఖా ఏక్ ఖ్వాబ్ తో యే సిల్సిలే హుయే, మోహన్ బాబు మమతకులకర్ణి ల నీ చీర చెంగు ఈ పూల రంగు .. వెంకటేష్ టబుల కొత్త కొత్తగా ఉంది.. అన్న పాటలు చాలాసార్లు విని ఉంటారు. అయితే ఈ పాటను చిత్రీకరించిన ప్రదేశం చాలా అందంగా కనువిందు చేస్తూ ఉంటుంది. ఆ పాటలు రంగు రంగుల తులిప్ పువ్వులతో కనువిందు చేస్తూ..  షూటింగ్ లొకేషన్‌ అందరిని ఆకట్టుకుంటాయి. మన దేశంలోన కశ్మీర్ లోని తులిప్‌ గార్డెన్ ను చూసేందుకు ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు వేచి చూస్తారు. అయితే కాశ్మీర్‌లోని తులిప్ గార్డెన్ కంటే ఇంకా  ప్రత్యేకమైన తులిప్ గార్డెన్స్ ప్రపంచంలో ఉన్నాయి

వాస్తవానికి, నెదర్లాండ్స్‌ను తులిప్‌ల భూమి అని పిలుస్తారు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద తులిప్ తోట ఉంది. ఈ తోట పేరు- కుకెన్‌హాఫ్. అవును ఇంద్రధనస్సు నేలమీదకు దిగివచ్చిందా అన్న చందంగా ఇక్కడ తులిప్ పువ్వులు కనువిందు చేస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ తులిప్ గార్డెన్‌ని సందర్శించడానికి దేశాలు, విదేశాల నుండి ప్రజలు వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

తులిప్ గార్డెన్స్ 

View this post on Instagram

A post shared by Keukenhof (@visitkeukenhof)

7 మిలియన్ తులిప్స్ క్యూకెన్‌హాఫ్ తులిప్ గార్డెన్ 7 మిలియన్ పూలతో అందంగా కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ తోట ఆమ్‌స్టర్‌డామ్ నుండి అరగంట ప్రయాణిస్తే చేరుకోవచ్చు. నెదర్లాండ్స్‌లోని కీకెన్‌హాఫ్ తులిప్ గార్డెన్ మార్చి 23 నుండి మే 14, 2023 వరకు తెరిచి ఉంటుంది. పర్యాటకులు ఈ గార్డెన్ అందాలను చూస్తూనే ఉంటారు. ఇక్కడ 800 రకాల తులిప్‌లు ఉన్నాయి. ఈ తోటలో పర్యటించే సందర్శకులు మరచిపోలేని అనుభూతిని పొందుతారు.

ఎంత పెద్ద తోట అంటే  ఈ ఫ్లవర్ పార్క్ 32 హెక్టార్లలో ఉంది. తులిప్‌లను ఒక్కొక్కటిగా చూడవచ్చు. ఇక్కడి అందాలు భూతల స్వర్గం అనిపిస్తాయి. తులిప్స్ అందాలను చూడాలంటే.. ప్రకృతి ప్రేమికులైతే ఈ పార్కును తప్పక సందర్శించాలి.  పార్క్ ని సందర్శించడం కోసం 19 యూరోలు అంటే దాదాపు 1,700 రూపాయలు ఖర్చు చేయాలి.

గొప్ప అనుభవం ఈ తులిప్ గార్డెన్‌లో నడవడం కూడా సరదాగా ఉంటుంది. Keukenhof లో.. మీరు 10 మైళ్లు అంటే 15 కిలోమీటర్లు నడుస్తూ అద్భుతంగా వీక్షించవచ్చు. నడుస్తూ అందమైన పువ్వులు, చెరువులు, వివిధ రెస్టారెంట్లు చూస్తారు. అందమైన పువ్వులను ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించవచ్చు. ఈ ఫ్లవర్ పార్క్ నెదర్లాండ్స్‌లోని ఈ ఉద్యానవనం క్యూకెన్‌హాఫ్ చరిత్ర చాలా పురాతనమైంది. 1949లో చిన్నగా మొదలైన తులిఫ్ తోటల పెంపకం.. ఈ రోజు కొన్ని వేల హెక్టార్లకు చేరుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..